VROకి షాకిచ్చిన వాలంటీర్.. పట్టపగలు రోడ్డుపై పరుగులు!

VROకి షాకిచ్చిన వాలంటీర్.. పట్టపగలు రోడ్డుపై పరుగులు!

ప్రజలకు సేవలు చేయడం ప్రభుత్వ అధికారుల బాధ్యత. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా పని చేస్తూ..మంచి పేరు సంపాదిస్తారు. మరికొందరు మాత్రం అవినీతి సొమ్ముకు అలవాటు పడి ప్రజలను పట్టి పీడిస్తుంటారు. ముఖ్యంగా అవినీతి ఘటనలు ఎక్కువగా పోలీసు, రెవెన్యూ శాఖలో జరుగుతాయని చాలా మంది అభిప్రాయా పడుతుంటారు. ఆ మాటలకు బలం చేకూర్చేలానే అనేక ఘటనకు కూడా జరుగుతుంటాయి. ప్రజల నుంచి డబ్బులు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులను తరచూ అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకుంటారు. తాజాగా ఏపీలో ఓ వాలంటీర్ లంచం అడిగిన వీఆర్వోను ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు. మరి.. ఈ ఘటనకు సంబంధిచి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం  పేరంగుడిపల్లికి చెందిన వీరంరెడ్డి లక్ష్మీరెడ్డికి  అజీజ్ పురం అనే గ్రామంలో 2.73 ఎకరాల భూమి ఉంది. లక్ష్మీరెడ్డి కుమారుడు భాస్కర్ రెడ్డి గోసుల వీడు గ్రామంలో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ భూమికి సంబంధించి..తన తండ్రి పేరున పట్టాదారు పాసుపుస్తకం కోసం ప్రయత్నిస్తున్నారు. అజీజ్ పురం ఇన్ ఛార్జీ గా ఉన్న ఏరువారి పల్లి వీఆర్వో కాసు వేణుగోపాల్ రెడ్డిని భాస్కర్ రెడ్డి కలిశారు. పట్టదారు పాసుపుస్తకం కోసం ఏడాదిగా తిరుగుతున్న రాలేదు. ఇక పాసుపుస్తకం ఇవ్వాలంటే లక్ష రూపాయాలు ఇవ్వాలని వీఆర్వో డిమాండ్ చేశాడు. అంత ఇవ్వాలేనని చెప్పి.. చివరకు రూ.30 వేలకు ఓకే చెప్పారు. అయితే తమ పొలం తమకే పాసు పుస్తకం చేయడానికి లంచం అడగటంతో భాస్కర్ రెడ్డి మనస్తాపం చెందాడు.

ఎలాగైనా ఈ అవినీతి అధికారికి బుద్ధి చెప్పాలని భావించాడు. తనను వీఆర్వో లంచం అడిగిన విషయాన్ని భాస్కర్ రెడ్డి.. ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల సూచనల మేరకు భాస్కర్.. వీఆర్వోను కనిగిరిలోని కపిల లాడ్జి సెంటర్ వద్దకు రమ్మనాడు. అప్పటికే మారువేషంలో ఉన్న అధికారులు..లంచం తీసుకుంటున్న వీఆర్వోను పట్టుకున్నారు. అయితే డబ్బుల్ని పక్కన విసిరేసి.. వీఆర్వో రోడ్డుపై పరుగులు తీశాడు. పారిపోయేందుకు ప్రయత్నించిన వీఆర్వోను  అధికారులు పట్టుకున్నారు. అతడి జేబులు  రూ.32వేలు అనధికారికంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం స్థానికంగా ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. మరి.. ఇలా లంచాల కోసం ప్రజలను పీడిస్తున్న ఇలాంటి అవినీతి అనకొండలను ఏ విధంగా శిక్షించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: AP: ఆటో డ్రైవర్‌ కుమార్తెకు అరుదైన అవకాశం.. ఏకంగా ఐక్యరాజ్యసమితి సదస్సుకు

Show comments