తెలుగు రాష్ట్రాల ఓటర్లకు గుడ్ న్యూస్.. బస్ టికెట్లపై భారీ డిస్కౌంట్

ఓటు శాతం పెంచేందుకు పలు సంస్థలు, ఆయా ప్రభుత్వాలు అనేక ఆఫర్స్ ని, డిస్కౌంట్స్ ని అందిస్తున్నాయి. వినూత్నంగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓటు వేసేందుకు సొంత ఊర్లకు వెళ్లే వారి కోసం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.

ఓటు శాతం పెంచేందుకు పలు సంస్థలు, ఆయా ప్రభుత్వాలు అనేక ఆఫర్స్ ని, డిస్కౌంట్స్ ని అందిస్తున్నాయి. వినూత్నంగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓటు వేసేందుకు సొంత ఊర్లకు వెళ్లే వారి కోసం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.

మామూలు సమయాల్లోనే హాట్ డీల్స్ అని, డిస్కౌంట్స్ అని పెడుతుంటాయి పలు సంస్థలు. బస్ ఆక్యుపెన్సీని పెంచుకునేందుకు ఆర్టీసీ, ప్రైవేట్ సంస్థలు టికెట్ రేట్లపై రాయితీని అందిస్తుంటాయి. ఇక ఎన్నికలనేసరికి బాధ్యతగా ఓటర్లను పోలింగ్ బూత్ లకి రప్పించేందుకు పలు సంస్థలు ఉత్సాహంగా పని చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచాలని అటు ప్రభుత్వం, ఇటు పలు ప్రైవేట్ సంస్థలు వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నాయి.

ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు వేసిన వారికి డైమండ్ రింగ్, ఫ్రిడ్జ్, టీవీ వంటివి ఆఫర్ చేస్తున్నాయి. ఆ మధ్య బెంగళూరులో జరిగిన ఎన్నికల సమయంలో ర్యాపిడో సంస్థ కూడా ఫ్రీ రైడ్స్ ని కల్పించింది. వృద్ధులు, వికలాంగులు వంటి వారిని ఇంటి నుంచి పోలింగ్ బూత్ కి ఓటు వేయడం అయిపోగానే పోలింగ్ బూత్ నుంచి ఇంటికి ఉచితంగా ర్యాపిడో బైక్ మీద తీసుకెళ్లి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టింది సదరు సంస్థ. ఎలాగైనా ఓట్లు శాతం పెంచాలని.. అందరితో ఓట్లు వేయించాలని ఇలాంటి విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రైవేట్ సంస్థ ఓటర్ల కోసం ఒక ఆఫర్ ని తీసుకొచ్చింది. ఆన్ లైన్ బస్ టికెట్ బుకింగ్ యాప్ అభి బస్ ఓటర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.

సొంత ప్రాంతాలకు ఓటు వేసేందుకు వెళ్లేవారికి ప్రత్యేక రాయితీ కల్పించనున్నట్లు అభి బస్ సీఈఓ లెనిన్ కోడూరు, సీఓఓ రోహిత్ శర్మ వెల్లడించారు. మే 13 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఓటు వేసేందుకు సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సమయంలో ‘ABHIVOTE’ కూపన్ కోడ్ ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కూపన్ కోడ్ తో టికెట్ మీద కనీసం 20 శాతం నుంచి గరిష్టంగా 250 రూపాయల వరకూ రాయితీ పొందవచ్చునని అన్నారు. అంతేకాకుండా అదనంగా 100 రూపాయలు క్యాష్ బ్యాక్ కూడా పొందే అవకాశం ఉందని అన్నారు. ఈ అఫర్ ని ఏపీ, తెలంగాణ ఓటర్ల కోసమే ప్రత్యేకంగా రూపొందించామని అభి బస్ సంస్థ యాజమాన్యం తెలిపింది. 

Show comments