iDreamPost
android-app
ios-app

చనిపోయిందన్న తల్లిని బతికించిన కొడుకు.. అమ్మ అన్న పిలుపుతో

  • Published Feb 22, 2024 | 8:40 PM Updated Updated Feb 22, 2024 | 8:40 PM

Son Who Survived his Mother: అందరూ చనిపోయిందని భావించారు.. కానీ ఆ తల్లి కొడుకు మాటలు వినగానే ప్రాణం తిరిగి వచ్చింది.. ఓ కొడుకు ప్రేమ తల్లి ప్రాణాలు నిలబెట్టింది.

Son Who Survived his Mother: అందరూ చనిపోయిందని భావించారు.. కానీ ఆ తల్లి కొడుకు మాటలు వినగానే ప్రాణం తిరిగి వచ్చింది.. ఓ కొడుకు ప్రేమ తల్లి ప్రాణాలు నిలబెట్టింది.

  • Published Feb 22, 2024 | 8:40 PMUpdated Feb 22, 2024 | 8:40 PM
చనిపోయిందన్న తల్లిని బతికించిన కొడుకు.. అమ్మ అన్న పిలుపుతో

ఇటీవల కొంతమంది డబ్బు సంపాదన కోసం ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. ఉన్నతవిద్యనభ్యసించిన వారు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ బిజీ బిజీగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. తల్లిదండ్రులను మాత్రం స్వగ్రామంలో ఉంచి విదేశాలకు వెళ్లిన తనయులు ఇక్కడ వారి పరిస్థితి గురించి పట్టించుకోవడం మర్చిపోతుంటారని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. కానీ కొంతమంది కొడుకులు మాత్రం తల్లిదండ్రుల గురించి పట్టించుకుంటూ వారికి అన్ని విషయాల్లో చేదోడువాదోడుగా ఉంటారు. ఓ కొడుకు ప్రేమ చనిపోయిన తల్లిని బతికించింది. ఈ అపురూప సంఘటన అమలాపురంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్‌ మండలం జనుపల్లి మన్నా కాలనీకి చెందిన లంకలపల్లి శ్రీరామమూర్తి, సత్యవేణి దంపతులు నివాసం ఉంటున్నారు. ఇటీవల సత్యవేణి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఈ నెల 17న ఆమెకు బీపీ రావడంతో కిందపడిపోయింది. వెంటనే అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. 18వ తేదీ ఉదయానికి ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించి వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటుంది. వెంటిలేటర్ తీసేస్తే ఆమె చనిపోతుందని వైద్యులు తెలిపారు. ఆమె ఇక బతకడం కష్టమని.. బంధువులు ఎవరైనా ఉంటే చెప్పుకోండని కటుంబ సభ్యులకు సూచించారు. ఈ క్రమంలోనే మలేషియాలో ఉన్నా ఆమె కొడుకు (సోదరి కుమారుడు) ని త్వరగా రమ్మని కబురు పంపారు.

అంబులెన్స్ లో ఆమెను ఇంటికి తీసుకువచ్చారు.. అందరూ ఆమె చనిపోయిందని కన్నీరు పెట్టుకుంటున్నారు. అప్పటికే సత్యవేణి తన సోదరి కుమారుడి కోసం ఎంతో ఎదురు చూసింది. ఇక ఆమె అంత్యక్రియలకు బంధువుల అన్ని ఏర్పాట్లు చేశారు. అదే సమయానికి మలేషియా నుంచి కొడుకు వచ్చి తల్లిని చూసి అమ్మా నన్ను విడిచి ఎందుకు వెళ్లావ్ అంటూ తల్లివద్ద కూర్చోని ఏడ్చాడు. అంతే కొద్దిసేపటికే సత్యవేణి లేచి కూర్చుంది. అది గమనించి బంధువులు భయపడి పోయారు. మీరంతా ఎందుకు వచ్చారు అని ప్రశ్నించడంతో ఆమె నిజంగా బతికిందని నిర్ధారించుకున్నారు. ఆమెకు మళ్లీ బీపీ డౌన్ కావడంతో మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సత్యవేణి ఐసీయూలో చికిత్స పొందుతుంది. నిజంగా ఇంత మంది ఆమె వద్ద ఏడ్చినా.. కొడుకు పిలుపు ఆమెను మళ్లీ బతికించిదని బధువుల అంటున్నారు. కొడుకుపై ఆ తల్లికి ఎంతో ప్రేమ ఉందని.. అందుకే మరణాన్ని కూడా జయించి మళ్లీ బతికిందని అంటున్నారు. ఈ వార్తల అక్కడి ప్రాంతంలో తెగ వైరల్ అయ్యింది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet