వీడియో: వానల దెబ్బకు బిల్డింగ్ ఎక్కిన ఆంబోతు..

వీడియో: వానల దెబ్బకు బిల్డింగ్ ఎక్కిన ఆంబోతు..

గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వానలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా వర్షాలు విజృభిస్తున్నాయి. అనేక ప్రాంతాలు నదులను, చెరువులను తలపిస్తున్నాయి. హైదరాబాద్, విశాఖ పట్నం లాంటి నగరాలు ఈ వర్షాలకు చిగురుటాకుల వణికిపోతున్నాయి. ఈ వరదలకు పలువురు మృతి చెందగా, మరికొందరు నీటిలో గల్లంతయ్యారు. వానల దెబ్బకు ప్రజల ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఇక జనాల పరిస్థితే ఇలా ఉంటే మూగ జీవాల వేదన ఇక వర్ణాతీతం.  ఈ క్రమంలో ఓ  ఆంబోతు  వానలకు తట్టుకోలేక బిల్డింగ్ పైకి ఎక్కింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన పాలకొల్లు చోటుచేసుకుంది.

కొన్ని రోజుల నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. పలు గ్రామాలు, పట్టణాలు చెరువులుగా మారాయి. అలానే పశ్చిమగోదావరి జిల్లాలో కూడా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జోరు వానలకు అక్కడక్కడా రోడ్లు కూడా నదులను తలపిస్తోన్నాయి. ఇక ఈ వానలకు మూగ జీవాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆవులు, గేదెలు ఎద్దులు వంటి ఇతర జంతువులు రోడ్డు పక్కన, చెట్ల కింద నిలబడే పరిస్థితి లేకుండా పోయింది.

ఈ క్రమంలో పాలకొల్లు టౌన్ లోని రామగుండం సెంటర్‌లో ఓ ఎద్దు వానకు తట్టుకోలేక బిల్డింగ్‌పైకి ఎక్కింది. అక్కడ గేటు తీసే ఉండటంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ మొదటి అంతస్తులోకి వెళ్లి తిష్ట వేసింది. వరండాలోకి వెళ్లాక ఎటు వెళ్లాలో తెలియలేదు. అలాగని వెనక్కి వెళ్లి మెట్లు దిగటానికి శరీరం కూడా సహకరించలేదు. దీంతో ఆ ఎద్దు 12 గంటల పాటు అక్కడే నిల్చొని ఉంది. బయట ఈదురు గాలులతో కూడిన జోరు వాన  ఉండటంతో తిండి, నీళ్లు లేకుండా అలానే ఉండిపోయింది. బిల్డింగ్ పై ఉన్న ఎద్దును చూసిన స్థానికులు అవాక్కయ్యారు.

వెంటనే స్థానిక యానిమల్ వారియర్ కన్జర్వెన్సీ సోసైటీ సభ్యులు సమాచారం అందించారు. వారు  అక్కడికి  చేరుకుని కిందకు దింపాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అతి కష్టం మీద జాగ్రత్తగా మొదటి అంతస్తు నుంచి కిందకి మెట్లు గుండా దింపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  ప్రస్తుతం ఈ ఎద్దుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ‘హెడ్ సెట్ పెట్టుకుని బైక్ నడిపితే రూ.20 వేలు జరిమానా?’ ప్రభుత్వం క్లారిటీ

Show comments