iDreamPost

రూ. 6 కోట్లు దాటిన TG రాబడి! ఒక్క ఆలోచనతో RTAకి భారీ లాభాలు!

తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ టీఎస్ నుండి టీజీకి మారిన సంగతి విదితమే. తొలి రోజే తొలి టీజీ నంబర్ కోసం జరిగిన బిడ్డింగ్ లో లక్షల ఆదాయం వచ్చింది ఆర్టీఏకి. ఈ పది రోజుల్లో కోట్లలో ఆదాయం సమకూరింది. ఇంతకు ఎంతంటే..?

తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ టీఎస్ నుండి టీజీకి మారిన సంగతి విదితమే. తొలి రోజే తొలి టీజీ నంబర్ కోసం జరిగిన బిడ్డింగ్ లో లక్షల ఆదాయం వచ్చింది ఆర్టీఏకి. ఈ పది రోజుల్లో కోట్లలో ఆదాయం సమకూరింది. ఇంతకు ఎంతంటే..?

రూ. 6 కోట్లు దాటిన TG రాబడి! ఒక్క ఆలోచనతో  RTAకి భారీ లాభాలు!

తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై టీఎస్‌కి బదులు టీజీకి మార్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వ వినతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం ఆమోదం రావడం ఆలస్యం నిబంధనలను అమలు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. అలాగే వివిధ జిల్లాలకు కొత్త కోడ్ వచ్చిన సంగతి విదితమే. ఇటీవల రాష్ట్రంలో టీజీతో కొత్త రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 15 నుండి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, వాహనాల రిజిస్ట్రేషన్ తొలి రోజే ఫ్యాన్సీ అంటే స్పెషల్, లక్కీ నంబర్ల కోసం వాహనదారులు పోటీ పడ్డారు. దీంతో ఆర్టీఏ ( Regional Transport Authority) రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిన సంగతి విదితమే. తొలి రోజు ఫ్యాన్సీ నంబర్ల కోసం రూ. 1.26 కోట్లు రాగా, ఫీజుల ద్వారా రూ. 1.25 కోట్ల ఆదాయం వచ్చింది.

మొదటి రోజు ఖైరతాబాద్‌లో నిర్వహించిన బిడ్డింగ్‌లో టీజీ 09 0001 నెంబర్ కోసం రుద్ర రాజు రాజీవ్ కుమార్ అనే వాహన యజమాని రూ. 9,61,111 లక్షలు వెచ్చించిన సంగతి విదితమే. టీజీ 09 0909 నంబర్ కోసం భవ్య సింధు ఇన్ ఫ్రా సంస్థ రూ. 2.30 లక్షలు ఖర్చు పెట్టింది. అలాగే శాన్వితా రెడ్డి అనే వాహన యజమాని టీజీ 09 0005 నెంబర్ కోసం రూ. 2.21 లక్షలు వెచ్చించారు. టీజీ 09 0002 సంఖ్య కోసం దుశ్యంత్ రెడ్డి అనే వ్యక్తి రూ. 1.22 లక్షలు చెల్లించారు. కాగా, ఈ వారం రోజుల్లో ఆర్టీఏకు ఈ కొత్త రిజిస్ట్రేషన్ల ద్వారా కోట్ల ఆదాయం సమకూరింది. అంటే గత గురువారాని ఫ్యాన్సీ అండ్ లక్కీ, స్పెషల్ నంబర్ల కోసం నిర్వహించిన బిడ్డింగ్ ద్వారా రూ. 2.48 కోట్లు సమకూరాయి.

అలాగే ఫీజుల ద్వారా రూ. 3.10 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ లెక్కన మొత్తంగా రూ. 5.59 కోట్లు ఆర్టీఏకు సమకూరాయి. ఇక శనివారానికి ఆరు కోట్లు దాటినట్లు తెలుస్తోంది. మరో వైపు ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వాహనదారులు మాత్రం పాత టీఎస్ కోడ్‌తోనే అధికారులు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికి మాత్రం టీజీ కోడ్ సిరీస్‌ను కేటాయిస్తున్నారు. ఆదిలాబాద్‌కు కోడ్ టీజీ 01గా కేటాయించారు. కరీంనగర్‌కు టీజీ 02, హనుమ కొండకు టీజీ 03,ఖమ్మం -టీజీ 04, నల్గొండకు వచ్చేసి రవాణా కోడ్ టీజీ 05గా ఉంటుంది.మహబూబ్‌నగర్‌కు కోడ్ టీజీ 06,రంగా రెడ్డికి కోడ్ టీజీ 07, మేడ్చల్ మల్కాజిగిరి టీజీ 08గా ఉంది. హైదరాబాద్‌కు ఆరు కోడ్స్ కేటాయించారు. టీజీ 9, 10, 11, 12, 13,14 కోడ్లు హైదరాబాద్ వాహనదారులకు వర్తిస్తాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి