iDreamPost
android-app
ios-app

తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ అప్‌డేట్‌!

తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ అప్‌డేట్‌!

తెలంగాణలో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. గత కొద్దిరోజుల నుంచి తరచుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి చెదురుమొదురుగా జల్లులు పడుతున్నాయి. నిన్న కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. అయితే, ఈ రోజు వర్ష ప్రభావం కనిపించటం లేదు. ఇక, ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలంగాణలో వర్షాలపై కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ఇవాళ వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు బలహీన పడటం వల్ల వర్షాలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది. దట్టమైన మేఘాలు లేకపోవటం వల్ల అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

దాదాపు 12 జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరో 10 జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం ఇకపై వర్షాలు తగ్గుతూ పోయే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే ఎండలు వాయించేస్తాయి. ఇప్పటికే వర్షం లేని సమయంలో ఎండలు విజృంభిస్తున్నాయి. ఎండాకాలం వచ్చిందా ఏంటి? అన్నట్లుగా జనాల్ని ఇబ్బంది పెడుతున్నాయి. మరి, తెలంగాణలో వర్షాలు తగ్గుతాయన్న హైదరాబాద్‌ వాతావరణ శాఖ అంచనాపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.