iDreamPost

అనాథ పిల్లలకు అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం!

అనాథ పిల్లలకు అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం!

సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రి మండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక సమావేశ అనంతరం తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామని ఆయన అన్నారు. దీంతో పాటు మెట్రో విస్తరణకు కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుందని, ఇందులో భాగంగానే రూ.60 వేల కోట్లు కేటాయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఇక దీంతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎంతో నష్టం వాటిల్లింది. వరద బాధితులకు సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే? రాష్ట్రంలో ఉన్న అనాథ బిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇక నుంచి వారి పూర్తి సంరక్షణ కోసం పాలసీ తీసుకొస్తామని కూడా వెల్లడించారు. ఇదే కాకుండా రాష్ట్రంలోని ప్రతీ జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండేలా చూస్తామన్నారు. ఈ సమావేశంలో కొత్తగా మరో 8 మెడికల్ కళాశాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి