iDreamPost

Double Decker Corridor: హైదరాబాద్​లో డబుల్ డెక్కర్ కారిడార్.. ట్విన్ సిటీస్ సహా 5 జిల్లాలకు ప్రయోజనం!

  • Published Mar 09, 2024 | 9:58 AMUpdated Mar 09, 2024 | 10:00 AM

తెలంగాణ రాజధాని హైదరాబాద్ సిగలో మరో ఆణిముత్యం చేరనుంది. భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర సర్కారు పూనుకుంది.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ సిగలో మరో ఆణిముత్యం చేరనుంది. భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర సర్కారు పూనుకుంది.

  • Published Mar 09, 2024 | 9:58 AMUpdated Mar 09, 2024 | 10:00 AM
Double Decker Corridor: హైదరాబాద్​లో డబుల్ డెక్కర్ కారిడార్.. ట్విన్ సిటీస్ సహా 5 జిల్లాలకు ప్రయోజనం!

తెలంగాణ రాజధాని హైదరాబాద్ సిగలో మరో ఆణిముత్యం చేరనుంది. మహారాష్ట్రలోని నాగ్​పూర్​లో నిర్మించినట్లుగా భాగ్యనగరంలోనూ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర సర్కారు పూనుకుంది. ఇప్పటికే నాగ్​పూర్​లో వెహికిల్స్, మెట్రో రైళ్లు దూసుకుపోతున్నాయి. అదే తరహాలో ఇక్కడ కూడా డబుల్ డెక్కర్ నిర్మాణం వల్ల ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీరబోనున్నాయి. నేషనల్ హైవే-44 మీద రూ.1,580 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5.32 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి కండ్లకోయ జంక్షన్​కు దగ్గర్లో శనివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో డబుల్ డెక్కర్ కారిడార్ ప్రత్యేకతలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్​లో ఇదే తొలి డబుల్ డెక్కర్ కారిడార్ కానుంది. ఈ కారిడార్ మీద రెండో దశలో మెట్రో రూట్ నిర్మించనున్నారు. ఇప్పుడు బ్రిడ్జ్ పైభాగంలో మెట్రో తిరిగేలా పిల్లర్ల నిర్మాణం చేస్తారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న ఏరియాలోని ప్యారడైజ్ జంక్షన్ ఇతర సిగ్నల్స్​, చౌరస్తాల్లో ఇరుకైన రోడ్లు ఉండటంతో భారీగా వాహనాల రాకపోకలతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఈ ఏరియాలో వాహనాల రద్దీతో గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరి ప్రయాణం సాఫీగా సాగనుంది. నిర్మాణం విషయానికొస్తే.. ఎన్​హెచ్​-44 మీద సికింద్రాబాద్​లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై తాడ్​బండ్ జంక్షన్, బోయినపల్లి జంక్షన్ మీదుగా డెయిరీ ఫామ్ రోడ్డు దగ్గర కారిడార్ ముగుస్తుంది.

ప్యారడైజ్ జంక్షన్ వద్ద నుంచి డెయిరీ ఫామ్ రోడ్డు వరకు మొత్తం కారిడార్ పొడవు 5.32 కిలోమీటర్లు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ పొడవు 4.65 కిలోమీటర్లు ఉంటుంది. ఇంక అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.6 కిలోమీటర్లు ఉంటుంది. ఇది బేగంపేట ఎయిర్​పోర్ట్​కు దగ్గర్లో నిర్మాణం అవుతోంది. ఈ డబుల్ డెక్కర్ కారిడార్​లో మొత్తం 131 స్తంభాలు ఉంటాయి. సిక్స్ లేన్స్​లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. బోయినపల్లి జంక్షన్​కు సమీపంలో రెండు వైపులా ర్యాంపులు నిర్మిస్తారు. కాగా, సికింద్రాబాద్ రోడ్డు విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్​కు కంటోన్మెంట్ ఏరియాలోని రూల్స్ ఆటంకంగా మారాయి. కేంద్ర రక్షణ శాఖ పర్మిషన్స్ లేకపోవడంతో ఈ కారిడార్ నిర్మాణం కాలేదు. అయితే రక్షణ శాఖ భూములు రాష్ట్ర సర్కారుకు బదలాయించాలని ఇటీవల సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్​నాథ్ సింగ్​ను సీఎం రేవంత్ కోరారు. దీంతో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అంగీకరిస్తూ మార్చి 1న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం లేఖ పంపింది.

ఇదీ చదవండి: రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం. సెలవులు రద్దు.. కార‌ణం ఇదే..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి