iDreamPost

నేత కార్మికులకు గుడ్ న్యూస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ శుభవార్త ఏంటంటే?

చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ శుభవార్త ఏంటంటే?

నేత కార్మికులకు గుడ్ న్యూస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

నేత కార్మికులు అనగానే టక్కున గుర్తొచ్చేది తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇక్కడ ఎక్కువ మంది నేత పనిపై ఆధారపడి జీవిస్తున్నవారే. తెలంగాణ రాష్ట్రం రాక ముందు నేత కార్మికులు చేతినిండ పని లేక ఆదాయం సరిగా రాక ఎంతో మంది తనువులు చాలించిన సంఘటనలు కోకొల్లలు. తెలంగాణ వచ్చాక నేతన్నల జీవితాల్లో వెలుగులు నిండాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నలకు పని కల్పించేందుకు బతుకమ్మ చీరలను అప్పగించింది. దీంతో వారి కష్టాలు కడతేరాయి. ఈ నేపథ్యలో తెలంగాణ ప్రభుత్వం నేత కార్మికులకు గుడ్ న్యూస్ అందించింది. నేతన్నల కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఎప్పటి మాదిరిగానే గతేడాది కూడా నేత కార్మికులు బతుకమ్మ చీరలను అందించారు. అయితే వీటికి సంబంధించిన రూ.351 కోట్ల బిల్లులను మాత్రం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో ఆ బకాయిలు అలాగే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో కొంత కాలంగా వేలాది మంది నేత కార్మికులు ఆందోళనలకు దిగారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పలుమార్లు అక్కడి కార్మికులతో చర్చలు జరిపారు.

Handloom weavers

దీనిపై స్పందించిన ప్రభుత్వం నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్ లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత తొందరలోనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం నిర్ణయంతో నేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి