iDreamPost

నీరాతో చక్కెర తయారీ.. కాసులు కురిపిస్తున్న యువతి సరికొత్త ఐడియా!

  • Published Apr 11, 2024 | 5:25 PMUpdated Apr 11, 2024 | 5:25 PM

సోషల్ మీడియాలో రకరకాల కథనాలు చూస్తున్నాం. ముఖ్యంగా యువత గురించి.. అందులోను అమ్మాయిల గురించి వచ్చే రీల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీరందరికి విరుద్ధంగా ఒక అమ్మాయి మాత్రం కొత్తరకం పద్దతిలో చక్కరను కనిపెట్టింది. అది ఎలానో చూసేద్దాం.

సోషల్ మీడియాలో రకరకాల కథనాలు చూస్తున్నాం. ముఖ్యంగా యువత గురించి.. అందులోను అమ్మాయిల గురించి వచ్చే రీల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీరందరికి విరుద్ధంగా ఒక అమ్మాయి మాత్రం కొత్తరకం పద్దతిలో చక్కరను కనిపెట్టింది. అది ఎలానో చూసేద్దాం.

  • Published Apr 11, 2024 | 5:25 PMUpdated Apr 11, 2024 | 5:25 PM
నీరాతో చక్కెర తయారీ.. కాసులు కురిపిస్తున్న యువతి సరికొత్త ఐడియా!

ఉదయం లేచింది మొదలు.. నిద్రపోయే వరకు సోషల్ మీడియాలో వచ్చే కథనాలు కోకొల్లలు. ముఖ్యంగా యువత ఫేమస్ అవ్వడం కోసం చేయని పని అంటూ లేదు. ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేయడం ఎలా పడితే అలా ప్రవర్తించడం లాంటివి చేస్తున్నారు. అయితే ఇవన్నీ కాయిన్ కు ఒక వైపు మాత్రమే .. మరో వైపు చూసినట్లయితే కొంతమంది యువత రామ కలలను సాకారం చేసుకుంటూ.. లక్ష్యాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో విలాసంతవంతమైన జీవితాలను వదిలేసి మరీ.. వ్యాపారాలు, వ్యవసాయాలు చేసే వారిని ఎంతో మందిని చూస్తూనే ఉన్నాము. ఇప్పుడున్న జెనెరేషన్ వారు వ్యవసాయంపై చూపిస్తున్న ఆసక్తి చూపిస్తుంటే అందరికి ఎంతో ముచ్చటగా ఉంటుందని పెద్దలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మరొక యువతి సరికొత్త పద్దతిలో పోషకాలు, ఔషధ విలువలతో కుడిని చక్కరను ఎలా తయారు చేయాలో కనిపెట్టింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన యువతి శ్రీయ నేరెళ్ల. సాధారంణగా అందరికి తాటి, ఈత, ఖర్జూర చెట్ల నుంచి కల్లు తీస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఈ కల్లును సూర్యోదయం కంటే ముందే తీస్తే కనుక దానిని నీరా అంటారు. ఇప్పుడు ఈ యువతి నీరా నుంచి చెక్కరను తయారు చేస్తూ.. అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆమె ఫైన్ ఆర్ట్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత పామ్ జాగరీ సబ్జెక్టులో పీజీ డిప్లొమా పూర్తి చేసింది. అయితే ఒకానొక సమయంలో కేరళలో కొబ్బరి పాలతో చెక్కర తయారు చేసే విధానం ఆమెను ఎంతో ఆకర్షించింది. అది కాస్త ఆమెకు కొత్త ఆలోచనను పుట్టుకొచ్చేలా ప్రేరేపించింది. కాస్త కొత్తగా నీరాతో చెక్కరను చేస్తే ఎలా ఉంటుందా అని శ్రీయ భావించి .. క్రమంగా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుంది. పరిశ్రమలకు వెళ్లి చెక్ చేయడం, సైంటిస్ట్ నుంచి.. అందుకు తగిన టిప్స్ తీసుకోవడం అన్ని చేస్తూ ఉండేది. ఆమె ప్లాన్ కాస్త వర్క్ అవుట్ అవ్వడంతో.. ఆమె ఒక ఫామ్ పెట్టాలని నిర్ణయించుకుంది.

ఇక అందుకోసం నీరా ఎక్కువగా లభించే ప్లేస్ అయిన మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో ఈ సంస్థను ఏర్పాటు చేసుకుంది. పైగా అందుకోసం స్థానిక గిరిజనులతో.. ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అంతేకాకుండా పెట్టుబడి కోసం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద రూ.50 లక్షల లోన్ తీసుకుంది. వాటితో పాటు తల్లిదండ్రులు, మిత్రుల సహాయసహకారాలతో మరొక రూ.30 లక్షలు సమకూర్చారు. ఇక సీపీసీఆర్‌ఐ వారు ఈ యువతి పెట్టబోయే సంస్థకు టెక్నీకల్ గా సపోర్ట్ ఇచ్చారు. దీనితో ఆమె అనుకున్న కల నెరవేరింది. ఈ చెక్కరను “కానుక” ఆర్గానిక్స్ అనే పేరుతో గత సంవత్సరం మార్కెట్ లోకి తీసుకుని వచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు .. ఈ కామర్స్ సంస్థలు కూడా ఈ నీరా చెక్కరను విక్రయించేందుకు ముందుకు వచ్చాయి. అయితే శ్రీయ .. నీరా చెక్కెరతో పాటు నీరా బెల్లాన్ని కూడా ఉత్పత్తి చేస్తోంది. సరికొత్త పద్దతిలో ఇలా కల్తీ లేని ఆహార పదార్ధాలను తయారు చేస్తూ.. ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచింది శ్రీయ. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి