iDreamPost

త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు CM రేవంత్?

సామాన్యుల నుంచి మొదలుకుని సెలబ్రిటీల వరకు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

సామాన్యుల నుంచి మొదలుకుని సెలబ్రిటీల వరకు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు CM రేవంత్?

ఈ మధ్య సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం ఏదైనా ఉందంటే అది కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ మాత్రమే. హైదరాబాద్ మహానగరంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన హోటల్స్ ఉన్నప్పటికీ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు ఉన్న క్రేజే వేరు. ఇప్పుడు సామాన్యుల నుంచి మొదలుకుని సెలబ్రిటీల వరకు ఫుడ్ స్టాల్ కు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను సందర్శించనున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియా పుణ్యమాని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ నెట్టింటా వైరల్ గా మారింది. నిత్యం వందలాది మంది ఫుడ్ లవర్స్ కుమారి ఆంటీ అందించే ఫుడ్ కోసం క్యూలు కడుతున్నారు. ఈ క్రమంలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే నిన్న కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ పోలీసులు ఫుడ్ స్టాల్ వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని చెప్పి అడ్డుకున్నారు. దీంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆమె ఫుడ్ స్టాల్ కు ఏవిధమైన ఆటంకం కలిగించ వద్దని అధికారులకు సూచించారు. దీంతో ప్రభుత్వం ఆమె ఫుడ్ స్టాల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను త్వరలోనే సందర్శించనున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే పాపులారిటీ సొంతం చేసుకున్న కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ సీఎం రాకతో ఆ క్రేజ్ మరింత పెరగనున్నట్లు పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక సామాన్యులు, సెలబ్రిటీలతో పాటు సీఎం కూడా కుమారి ఆంటీ చేతి వంటను రుచి చూడనుండడంతో ఈ విషయం మరింత ఆసక్తికరంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి