iDreamPost
android-app
ios-app

Mirai Glimpse: అశోకుడి రహస్యంతో వస్తున్న తేజ సజ్జ.. ‘మిరాయ్’ గ్లింప్స్ మెరాకిల్!

  • Published Apr 18, 2024 | 2:56 PM Updated Updated Apr 18, 2024 | 2:56 PM

ఈగల్ మూవీ తర్వాత డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని, హనుమాన్ తర్వాత తేజ సజ్జ నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మకమైన చిత్రం 'మిరాయ్'. అశోకుడి రహస్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఆ గ్లింప్స్ ఎలా ఉన్నాయంటే?

ఈగల్ మూవీ తర్వాత డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని, హనుమాన్ తర్వాత తేజ సజ్జ నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మకమైన చిత్రం 'మిరాయ్'. అశోకుడి రహస్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఆ గ్లింప్స్ ఎలా ఉన్నాయంటే?

  • Published Apr 18, 2024 | 2:56 PMUpdated Apr 18, 2024 | 2:56 PM
Mirai Glimpse: అశోకుడి రహస్యంతో వస్తున్న తేజ సజ్జ.. ‘మిరాయ్’ గ్లింప్స్ మెరాకిల్!

తేజ సజ్జ.. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ ను అందుకున్నాడు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో.. తేజ రేంజే మారిపోయింది. ఇక అతడి నుంచి నెక్ట్స్ రాబోతున్న చిత్రం ‘మిరాయ్’. టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఇటీవలే మాస్ మహారాజాతో ఈగల్ మూవీతో డైరెక్టర్ గా మంచి మార్కులు కొట్టేశాడు కార్తీక్. ఆ చిత్రం తర్వాత ఇతడి నుంచి వస్తున్న మరో ప్రెస్టీజియస్ మూవీ మిరాయ్. అశోకుడి రహస్యంతో రాబోతున్న ఈ మూవీ గ్లింప్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం పదండి.

కార్తీక్ ఘట్టమనేని.. సూర్య వర్సెస్ సూర్య, ఈగల్ వంటి డిఫరెంట్ మూవీలతో తెలుగు ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు హనుమాన్ హీరో తేజ సజ్జతో మిరాయ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. భారతదేశ చరిత్రలో కళింగ యుద్ధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ యుద్ధం తర్వాత అశోకుడు యోగిగా మారాడు. ఇక అశోకుడిని యోగిగా మార్చిన ఓ అపార గ్రంథం కోసం జరిగే పోరాటమే ఈ సినిమా స్టోరీ.

తొమ్మిది గ్రంథాలను కాపాడటం కోసం తొమ్మిది మంది యోధులు ఉంటారు. దుష్ట శక్తుల నుంచి ఆ అపార గ్రంథాన్ని కాపాడే పాత్రలోనే మెరవనున్నాడు తేజ సజ్జ. ఇక మిరాయ్ మేకింగ్ నెక్ట్స్ లెవల్లో ఉండబోతోందని గ్లింప్స్ చూస్తేనే తెలిసిపోతోంది. గ్రాఫిక్స్ ప్రేక్షకులను వేరే లోకంలోకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక పోరాట యోధుడిగా తేజ సజ్జ తనదైన విన్యాసాలతో ఆకట్టుకున్నాడు. ఈ ఫుటేజీ చూస్తుంటే.. హనుమాన్ ను మించిన సక్సెస్ తేజ కొట్టబోతున్నట్లు అనిపిస్తోంది. గ్లింప్స్ లో పోరాటలు ఆకట్టుకున్నాయి. ఇక మిరాయ్ లో మరో మెరాకిల్ ఉన్నట్లు సమాచారం.

ఇందులో విలన్ పాత్రలో మంచు మనోజ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మనోజ్ విలన్ విశ్వరూపం మనం చూడొచ్చు. రితిక నాయక్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటుగా విదేశాల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18, 2025న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 3Dలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గ్లింప్స్ చూస్తుంటే.. డైరెక్టర్ కార్తీక్, తేజ సజ్జల పేర్లు ఇండస్ట్రీలో గట్టిగా వినిపించడం ఖాయం. మరి మిరాయ్ గ్లింప్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetMadridbetJojobetjojobetJojobetCasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş