Somesekhar
టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ లో చెలరేగడంతో.. భారత్ ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది ఇంగ్లండ్. దీంతో విజయం ముంగిట ఉంది టీమిండియా.
టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ లో చెలరేగడంతో.. భారత్ ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది ఇంగ్లండ్. దీంతో విజయం ముంగిట ఉంది టీమిండియా.
Somesekhar
ఇంగ్లండ్ తో జరుగుతున్న కీలకమైన నాలుగో టెస్ట్ లో టీమిండియా స్పిన్నర్లు చెలరేగిపోయారు. తొలి ఇన్నింగ్స్ లో సమష్టిగా రాణించి.. ప్రత్యర్థిని పడగొట్టిన బౌలర్లు.. ఈసారి అంతకంటే అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 145 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో టీమిండియా ముందు 192 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది.
సిరీస్ కీలకమైన నాలుగో టెస్ట్ లో సత్తాచాటారు టీమిండియా బౌలర్లు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ను 353 పరుగులు చేయించిన మన బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ప్రత్యర్థిని తక్కువ పరుగులకే ఆలౌట్ చేసి.. విజయానికి బాటలు వేశారు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దగ్గరి నుంచే భారత బౌలర్లు వారిపై పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. సీనియర్ వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ టాపార్డన్ ను కాకవికలం చేశాడు. డకెట్ తో ప్రారంభించి వరుసగా ఓలీ పోప్, జో రూట్ ను పెవిలియన్ కు పంపాడు అశ్విన్.
ఇక మరో ఎండ్ లో కుల్దీప్ కూడా తన మణికట్టుతో మాయ చేశాడు. వీరిద్దరు కలిసి ఇంగ్లీష్ ఆటగాళ్ల భరతం పట్టారు. దీంతో కేవలం 145 రన్స్ కే ఆలౌట్ అయ్యింది ఇంగ్లండ్ టీమ్. జట్టులో ఓపెనర్ జాక్ క్రాలే ఒక్కడే 60 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అశ్విన్ 5, కుల్దీప్ 4 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. ఇక 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ బజ్ బాల్ క్రికెట్ తో టార్గెట్ వైపు దూసుకెళ్తోంది. రోహిత్ శర్మ, జైస్వాల్ ఇద్దరూ ధాటిగా ఆడేప్రయత్నం చేస్తున్నారు. దీంతో కేవలం 6 ఓవర్లలోనే 37 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ 24, జైస్వాల్ 14 రన్స్ తో బ్యాటింగ్ చేస్తున్నారు.
INDIA NEED 192 TO WIN THE TEST SERIES AGAINST ENGLAND. 🇮🇳 pic.twitter.com/CtioBdjczb
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 25, 2024
ఇదికూడా చదవండి: టీమిండియాలో నెక్ట్స్ ధోని అతడే.. గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!