SNP
Team India, Jasprit Bumrah, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌కు సిద్ధం అవుతున్న టీమిండియా.. ఆ ఒక్క తప్పు చేస్తే.. మాత్రం టీ20 వరల్డ్ కప్‌లో భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..
Team India, Jasprit Bumrah, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌కు సిద్ధం అవుతున్న టీమిండియా.. ఆ ఒక్క తప్పు చేస్తే.. మాత్రం టీ20 వరల్డ్ కప్‌లో భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఒక వైపు ఐపీఎల్ జోరుగా సాగుతున్నా.. మరోవైపు రాబోయే టీ20 వరల్డ్ కప్ 2024పై కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రాణిస్తున్న ఆటగాళ్లలలో ఎవరికి టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కుతుంది. ఎలాంటి టీమ్‌తో టీమిండియా వరల్డ్ కప్‌కు వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి అనే విషయాలపై క్రికెట్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంతమంది ఆటగాళ్ల పేర్లు కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. కెప్టెన్‌గా రోహిత్ వర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లు టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో ఉండే అవకాశం ఉంది.
అయితే.. ఇప్పటి వరకు వినిపిస్తున్న పేర్లను పరిశీలిస్తే.. టీమిండియా బ్యాటింగ్‌లో పటిష్టంగానే కనిపిస్తున్నా.. బౌలింగ్‌లోనే చాలా వీక్‌గా కనిపిస్తోంది. కేవలం ఒకే ఒక్క బుమ్రా మాత్రమే పెద్ద దిక్కుగా కనిపిస్తున్నాడు. బుమ్రా ఉన్నాడులే.. ఇంకో ఎవరో ఇద్దరు పేసర్లను తీసుకుని టీ20 వరల్డ్ కప్‌కు వెళ్లిపోతాం అని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తే దెబ్బ తినడం ఖాయం అని క్రికెట్ నిపుణులు హెచ్చరిస్తున్నాడు. బుమ్రా అద్భుతమైన బౌలర్ అయినప్పటికీ కేవలం ఒక్కడినే నమ్ముకుంటే తప్పు చేసినట్లు అవుతుందని అంటున్నారు. టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా బౌలింగ్‌లో ఎంత ఘోరంగా తేలిపోయిందో ఇప్పటికీ క్రికెట్ అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. ఇంగ్లండ్‌పై ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.
ప్రస్తుతం బుమ్రాతో పాటు అర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అర్షదీప్ సింగ్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో బాగానే రాణిస్తున్నా.. అతనిపై పూర్తిగా నమ్మకం పెట్టుకోలేం. ఎందుకంటే నిలకడగా రాణించే బౌలర్ కాదు. అలాగే సిరాజ్ కూడా అంతే.. తనదైన రోజున మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే సిరాజ్.. మిగతా సమయాల్లో ఒక సాధారణ బౌలింగ్ కంటే దారుణంగా పరుగులు సమర్పించుకుంటాడు. పైగా ఈ ఐపీఎల్ సీజన్‌లో సిరాజ్ విఫలం అవుతున్నాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. పైగా ఎకానమీ 9.63గా ఉంది.
ఇక అర్షదీప్ సింగ్ 8 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. అతని ఎకానమీ కూడా 9.40గా ఉంది. మరోవైపు బుమ్రా 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ 6.38 మాత్రమే. బుమ్రాకి.. మిగతా ఇద్దరు బౌలర్లకు ఎంత తేడా ఉందో క్లియర్‌గా కనిపిస్తోంది. పోనీ షమీని తీసుకుందాం అంటే.. అతను గాయం నుంచి అప్పటి వరకు పూర్తిగా కోలుకుంటాడా? లేదా? అన్నది అనుమానమే. ఇప్పటికైనా బీసీసీఐ కళ్లు తిరిచి.. బుమ్రా ఉన్నాడనే ధైర్యంలో అతనికి తోడు బెస్ట్ ఆప్షన్‌తో వెళ్లకుంటే.. ఈ టీ20 వరల్డ్ కప్‌ను కూడా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మర్చిపోవచ్చు.
Jasprit Bumrah is working hard on his batting. 👌
– Great news for Indian team…!!!pic.twitter.com/Yk2u0ucNcp
— Johns. (@CricCrazyJohns) April 26, 2024