Nidhan
టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ క్రికెట్లో ఎవరికీ దక్కని గౌరవం కింగ్‌కు దక్కింది.
టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ క్రికెట్లో ఎవరికీ దక్కని గౌరవం కింగ్‌కు దక్కింది.
Nidhan
టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ పేరు చెబితేనే ప్రత్యర్థి జట్లు గజగజలాడతాయి. అతడి బ్యాట్ ధాటికి తట్టుకోలేక మహామహా బౌలర్లు కూడా తోకముడిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పదిహేనేళ్లకు పైగా కెరీర్లో లెక్కకు మించిన సెంచరీలు, వేలాది పరుగులు, వందలాది రికార్డులు అతడి పేరు మీద నమోదయ్యాయి. క్రికెట్ ద్వారా పేరు సంపాదించిన ఈ డాషింగ్ బ్యాటర్.. ఇప్పుడు ఆ జెంటిల్మన్ గేమ్‌కే బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. క్రికెట్‌ను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చడంలో అతడి పాత్ర కూడా ఎంతగానో ఉంది. క్రికెట్ ఆడే దేశాలతో పాటు ఇతర దేశాల్లోనూ కోహ్లీకి భారీ అభిమాన గణం ఉంది. దానికి నిదర్శనం తాజాగా ఘనత అని చెప్పొచ్చు.
విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. 2024 ఏడాదికి గానూ ప్రపంచంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ క్రికెటర్‌గా కింగ్ నిలిచాడు. హైప్ ఆడిటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ సంవత్సరానికి గానూ అత్యంత ప్రభావితమైన క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. తద్వారా వరల్డ్ క్రికెట్లో ఎవరికీ అందని అరుదైన గౌరవాన్ని అతడు అందుకున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. కోహ్లీ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా అవతరించాడని.. క్రికెట్‌తో సంబంధం లేకుండా అతడి ఇన్ఫ్లుయెన్స్ భారీగా పెరిగిందని, వరల్డ్ వైడ్‌గా అతడ్ని ఆరాధించే వారి సంఖ్య మరింత పెరిగిందని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెబుతున్నారు.
మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ క్రికెటర్‌గా నిలవడం ద్వారా భారత క్రికెట్ గౌరవాన్ని కోహ్లీ మరింత పెంచాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విరాట్ ఇలాగే మరికొన్నాళ్లు ఆడాలని కోరుకుంటున్నారు. ఇక, ఐపీఎల్-2024లో కింగ్ బ్యాట్‌తో రెచ్చిపోతున్నాడు. ఇప్పటిదాకా ఆడిన 10 మ్యాచుల్లో కలిపి 500 పరుగులు చేశాడతను. ఇందులో 1 సెంచరీ సహా 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే అతడి స్ట్రయిక్ రేట్ 147గా ఉండటంతో టీ20 వరల్డ్ కప్‌లోనూ ఇలాడే ఆడితే సరిపోదని, ఇంకా వేగంగా పరుగులు చేయాలని నెటిజన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల రియాక్ట్ అయ్యారు. కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి టెన్షన్ వద్దని.. అతడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడని సమర్థించాడు. మరి.. కోహ్లీ అరుదైన ఘనత మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Virat Kohli is the most Influential Cricketer in the World in 2024. [Hype Auditor]
– The Global brand of cricket. 🐐 pic.twitter.com/r5wNvJLRao
— Johns. (@CricCrazyJohns) May 4, 2024