iDreamPost

ఆస్పత్రి బెడ్ పై టీమిండియా స్టార్ క్రికెటర్! అసలేం జరిగిందంటే?

ఓ టీమిండియా స్టార్ క్రికెటర్ ఆస్పత్రి బెడ్ పై ఉన్న పిక్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో అతడికి ఏమైంది అంటూ ఆందోళన పడుతున్నారు అభిమానులు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఓ టీమిండియా స్టార్ క్రికెటర్ ఆస్పత్రి బెడ్ పై ఉన్న పిక్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో అతడికి ఏమైంది అంటూ ఆందోళన పడుతున్నారు అభిమానులు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఆస్పత్రి బెడ్ పై టీమిండియా స్టార్ క్రికెటర్! అసలేం జరిగిందంటే?

ప్రస్తుతం టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో అదరగొడుతోంది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత టీమ్.. అందుకు తగ్గట్లుగానే ఆడుతోంది. వరుసగా రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి.. అదే జోరును మున్ముందు కూడా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక అమెరికాతో నేడు(బుధవారం) జరిగే మ్యాచ్ లో సైతం గెలిచి.. సూపర్ 8కు దర్జాగా వెళ్లాలని ఆరాటపడుతోంది. ఇదిలా ఉండగా.. ఓ టీమిండియా స్టార్ క్రికెటర్ ఆస్పత్రి బెడ్ పై ఉన్న పిక్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో అతడికి ఏమైంది అంటూ ఆందోళన పడుతున్నారు అభిమానులు. మరి ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఆ ప్లేయర్ ఎవరు? అతడికేమైంది.

సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు తమకు సంబంధించిన ఏ చిన్న విషయాలను అయినా.. సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. తాజాగా ఓ టీమిండియా స్టార్ ప్లేయర్ బెడ్ పై చికిత్స తీసుకుంటున్న ఫొటోను షేర్ చేశాడు. ఈ ప్లేయర్ ఎవరో కాదు.. శార్థూల్ ఠాకూర్. ఇంతకీ అసలు విషయం ఏంటంటే? శార్థూల్ ఠాకూర్ కాలికి గాయమైంది. తాజాగా ఆ గాయానికి ఆపరేషన్ చేయించుకున్నాడు శార్థూల్. ఆస్పత్రి బెడ్ పై కాలికి కట్టుతో ఉన్న పిక్ ను షేర్ చేస్తూ..”ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. త్వరలోనే గ్రౌండ్ లో కలుసుకుందాం. నాకు సహకరించిన అందరికి థ్యాక్స్” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్న తరఫున 9 మ్యాచ్ లు ఆడి కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టి దారుణంగా విఫలం అయ్యాడు. గాయం కారణంగా సీజన్ లో పూర్తి మ్యాచ్ లు ఆడలేదు శార్థూల్. అతడికి ఆపరేషన్ అయినట్లు తెలియడంతో.. అభిమానులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shardul Thakur (@shardul_thakur)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి