టీమిండియాను ఓడించడానికి ఆ ఒక్క ఫార్ములా చాలని బ్రెండన్ మెకల్లమ్ అన్నాడు. అతడు ఏ ఫార్ములా గురించి మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..
టీమిండియాను ఓడించడానికి ఆ ఒక్క ఫార్ములా చాలని బ్రెండన్ మెకల్లమ్ అన్నాడు. అతడు ఏ ఫార్ములా గురించి మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..
వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత వరుస సిరీస్‌లతో బిజీ అయిపోయింది టీమిండియా. ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్‌ను ఇప్పటికే ఫినిష్ చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి లాంటి స్టార్లు లేకుండానే బరిలోకి దిగిన భారత్ 4-1 తేడాతో ఈ సిరీస్‌ను సొంతం చేసుకుంది. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, జితేష్ శర్మ, రింకూ సింగ్, ముకేష్ కుమార్, రవి బిష్ణోయ్ లాంటి యంగ్‌స్టర్స్ ఈ సిరీస్‌తో మరోమారు తమ సత్తా చాటారు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌లతో తామే ఇండియన్ క్రికెట్‌కు ఫ్యూచర్ అని ప్రూవ్ చేశారు. కంగారూలతో పొట్టి ఫార్మాట్ సిరీస్‌ను సాధించిన జోష్‌లో ఉన్న టీమిండియా.. సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లేందుకు రెడీ అవుతోంది.
సఫారీ టూర్ ముగించుకొని స్వదేశానికి రాగానే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో టీమిండియా ఆడాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లీష్ టీమ్ భారత్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా ఇరు టీమ్స్ మధ్య ఐదు టెస్టు మ్యాచులు జరుగుతాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (2023-2025 సైకిల్)లో పాయింట్స్ టేబుల్లో మెరుగైన స్థానంలో ఉండాలి. కాబట్టి ఈ సిరీస్ అటు ఇంగ్లండ్‌తో పాటు ఇటు ఇండియాకూ అంతే కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో దానిపై ఇరు జట్లు ఇప్పటికే వ్యూహాలు కూడా రచిస్తున్నాయి. ప్లేయర్ల ఫిట్నెస్, సెలక్షన్ మీద ఫోకస్ పెడుతున్నాయి. అయితే ఇంగ్లీష్ టీమ్ గత రెండేళ్లుగా టెస్టుల్లో బజ్‌బాల్ క్రికెట్‌తో అదరగొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ జట్టు కోచ్‌గా న్యూజిలాండ్ లెజెండ్ బ్రెండన్ మెకల్లమ్ బాధ్యతలు చేపట్టాక ఆ టీమ్ ఆడేతీరు మారిపోయింది.
బజ్‌బాల్ ఫార్ములాతో ఎదురొచ్చిన ప్రతి టీమ్‌ను చిత్తు చేసుకుంటూ పోతోంది ఇంగ్లండ్. కొన్నిసార్లు టెస్టులను రెండు, మూడు రోజుల్లోనే ముగించేస్తోంది. అయితే ఈ క్రమంలో కొన్ని మ్యాచుల్లో ఓడిపోయినా ఇంగ్లండ్ తమ పంథాను మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న టెస్టు సిరీస్ గురించి ఆ టీమ్ కోచ్ మెకల్లమ్ మాట్లాడాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నోవేషన్ ల్యాబ్ లీడర్స్ మీట్ ఇండియా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియాతో ఆడటం తమకు అతిపెద్ద ఛాలెంజ్ అన్నాడు. కానీ ఆ సిరీస్ కోసం తాము చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెప్పాడు. వరల్డ్‌లోనే బెస్ట్ టీమ్ మీద తమను తాము పరీక్షించుకోవడానికి ఇదే కరెక్ట్ టైమ్ అన్నాడు మెకల్లమ్. సొంతగడ్డపై భారత్ చాలా డేంజరస్ టీమ్ అని తెలిపాడు. కానీ తాము మాత్రం బజ్‌బాల్ స్టైల్‌ను కంటిన్యూ చేస్తామని మెకల్లమ్ పేర్కొన్నాడు. భారత్‌ను ఓడించడానికి ఈ ఫార్ములా చాలన్నాడు. మరి.. టీమిండియాతో టెస్టు సిరీస్‌లో బజ్‌బాల్ ఫార్ములానే కొనసాగిస్తామని మెకల్లమ్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Jasprit Bumrah: బుమ్రాపై నీరజ్ చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ ఒక్క పని చేస్తే చాలంటూ..!
Brendon McCullum said, “I’m excited about the Test series in India because you want to test yourself against the best side and India is the best in their own condition. We’ve a great challenge next year”. pic.twitter.com/LBmhTRxoUl
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 4, 2023