iDreamPost

టీమిండియా జెర్సీపై బెంగాల్ CM సీరియస్.. కావాలనే చేస్తున్నారంటూ..!

  • Author singhj Published - 03:39 PM, Sat - 18 November 23

భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ టైమ్​లో వేసుకునే జెర్సీలపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు. కేంద్రంలోని అధికార బీజేపీ పన్నిన కుట్రలో భాగంగానే టీమిండియా ప్లేయర్లు ఆ రంగు జెర్సీలు ధరించారంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు.

భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ టైమ్​లో వేసుకునే జెర్సీలపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు. కేంద్రంలోని అధికార బీజేపీ పన్నిన కుట్రలో భాగంగానే టీమిండియా ప్లేయర్లు ఆ రంగు జెర్సీలు ధరించారంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు.

  • Author singhj Published - 03:39 PM, Sat - 18 November 23
టీమిండియా జెర్సీపై బెంగాల్ CM సీరియస్.. కావాలనే చేస్తున్నారంటూ..!

వన్డే వరల్డ్ కప్-2023 టైటిల్​కు భారత జట్టు మరో అడుగు దూరంలో ఉంది. లీగ్ స్టేజ్​లో తొమ్మిది మంది ప్రత్యర్థులను ఓడించిన టీమిండియా.. సెమీస్​లో న్యూజిలాండ్​కు నాకౌట్ పంచ్ ఇచ్చింది. లీగ్ దశలో చిత్తు చేసిన ఆస్ట్రేలియా టీమ్​తోనే ఫైనల్​లో తలపడబోతోంది రోహిత్ సేన. ఈ మ్యాచ్​లో గెలిస్తే చాలు.. 12 ఏళ్లుగా అందకుండా ఉన్న వరల్డ్ కప్ ట్రోఫీ మన ఒడిలో వచ్చి చేరుతుంది. భారత్​కు కప్పుకు మధ్య ఆసీస్ ఉంది. ఆ జట్టును ఓడించాలని 140 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నారు. 20 ఏళ్ల కింద గంగూలీ సేన ఎదుర్కొన్న ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైమ్ అని అంటున్నారు. వరుస విక్టరీలతో జోరు మీదున్న భారత్ రివేంజ్ తీర్చుకోవడానికి దీని కంటే మంచి సమయం ఉండదని చెబుతున్నారు.

ఇప్పటివరకు ఆడిన ఆటనే ఫైనల్ ఫైట్​లోనూ కంటిన్యూ చేస్తే టీమిండియాకు తిరుగుండదు. ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లకు సంబంధించిన షెడ్యూల్​ను బీసీసీఐ రిలీజ్ చేసింది. టాస్ వేసిన తర్వాత 1.35 గంటల నుంచి ఇండియన్ ఎయిర్​ఫోర్స్ ఆధ్వర్యంలోని సూర్యకిరణ్​ ఎయిర్​బాటిక్ బృందం ఎయిర్ షో చేయనుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్ టైమ్​లో ప్రముఖ సింగర్ ఆదిత్య గద్వీతో సంగీత కార్యక్రమం ఉంటుంది. ప్రీతమ్, జోనిటా గాంధీ, తుషార్ జోషీ తదితరులు కూడా ఈ వేడుకల్లో తమ టాలెంట్​తో అలరించనున్నారు. వరల్డ్ కప్ ఫైనల్​ను దృష్టిలో ఉంచుకొని ప్యాసింజర్స్ కోసం అహ్మదాబాద్​కు ఇండియన్ రైల్వేస్ స్పెషల్ ట్రైన్స్​ను నడపనుంది.

శనివారం నాడు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్​కు పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి మ్యాచ్ అయిపోయిన తర్వాత అహ్మదాబాద్ నుంచి తెల్లవారుజామున 2.30 గంటలకు ఒక రైలు ఢిల్లీకి బయలుదేరుతుంది. ముంబై-అహ్మదాబాద్ నడుమ కూడా మ్యాచ్ కోసం మూడు రైళ్లను ఏర్పాటు చేశారు. దేశమంతా ప్రపంచ కప్ ఫైనల్ ఫీవర్ నడుస్తోంది. ఈ తరుణంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్త కాంట్రవర్సీకి తెరలేపారు. టీమిండియా ఆటగాళ్లు వేసుకునే జెర్సీల విషయంలో కేంద్రలోని అధికార బీజేపీ కుట్ర పన్నిందని ఆమె ఆరోపించారు. క్రికెట్​తో పాటు దేశవ్యాప్తంగా వివిధ ఆర్గనైజేషన్స్​ను కాషాయ రంగులోకి మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ టైమ్​లో వేసుకునే జెర్సీల్లో మాత్రమే గాక మెట్రో స్టేషన్ల పెయింటింగ్స్​లోనూ బీజేపీ కాషాయ రంగును ప్రవేశపెట్టిందన్నారు మమతా బెనర్జీ. దేశమంతా కాషాయ రంగుతో నింపేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే భారత క్రికెట్ ప్రాక్టీస్ జెర్సీని కాషాయంలోకి మార్చారని దీదీ చెప్పుకొచ్చారు. టీమిండియా క్రికెటర్లను చూసి అందరూ గర్విస్తున్నామని.. వరల్డ్ కప్ నెగ్గుతారని నమ్ముతున్నామని పేర్కొన్నారు. అయితే భారత ప్లేయర్లంతా కుంకుమ పువ్వు రంగులో ఉన్న జెర్సీల్లో ప్రాక్టీస్ చేస్తున్నారని సీఎం మమత వివరించారు. మరి.. బీజేపీ కుట్ర పన్ని భారత ఆటగాళ్ల జెర్సీలను కాషాయంలోకి మార్చిందంటూ దీదీ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియాకు అతిపెద్ద బలం అతడే.. కమ్మిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి