iDreamPost

టీమిండియాకు అతిపెద్ద బలం అతడే.. కమ్మిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Author Soma Sekhar Published - 12:59 PM, Sat - 18 November 23

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియా ప్లేయర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్. టీమిండియాకు అతిపెద్ద బలం అతడే అంటూ చెప్పుకొచ్చాడు.

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియా ప్లేయర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్. టీమిండియాకు అతిపెద్ద బలం అతడే అంటూ చెప్పుకొచ్చాడు.

  • Author Soma Sekhar Published - 12:59 PM, Sat - 18 November 23
టీమిండియాకు అతిపెద్ద బలం అతడే.. కమ్మిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

వరల్డ్ కప్ ఫైనల్.. ప్రస్తుతం ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా, ఏ కేఫ్ లో చూసినా.. ఏ పాన్ డబ్బా దగ్గరకెళ్లినా వినిపించే మాట. ఈ మెగాటోర్నీలో భాగంగా జరగబోయే తుదిపోరులో టీమిండియా-ఆస్ట్రేలియాలు తలపడబోతున్నాయి. ఇక ఈ విశ్వ సమరం కోసం నరేంద్ర మోదీ స్టేడియం సిద్దమైంది. కాగా.. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టీమిండియా ప్లేయర్ పై ప్రశంసలు కురిపించాడు. సాధారణంగా గేమ్ కు ముందు ప్రత్యర్థి ఆటగాళ్లపై మాటల దాడి చేసి.. వారిని మానసికంగా కుంగదీయాలన్నది కొన్ని జట్లు, కొందరు ప్లేయర్లు చేసే పని. కానీ ఇందుకు విరుద్దంగా ఆసీస్ కెప్టెన్ భారత ప్లేయర్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. టీమిండియాకు అతిపెద్ద బలం అతడే అంటూ చెప్పుకొచ్చాడు. మరి కమ్మిన్స్ చెప్పిన ఆ ఆటగాడు ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.

క్రికెట్ ప్రపంచంలో సాధారణంగా మ్యాచ్ లకు ముందు ప్రత్యర్థులపై మాటల యుద్దాలకు దిగుతూ ఉంటాయి కొన్ని జట్లు. అందులో ముందు వరుసలో ఉంటాయి పాక్, ఆస్ట్రేలియాలు. ప్రత్యర్థులపై మాటల తూటాలను వదులుతూ.. వారిని మనసికంగా దెబ్బకొట్టి ఓడదీయాలన్నది వారి ప్లాన్. అయితే ఇలాంటి సంప్రదాయానికి రివర్స్ లో ఆసీస్ కెప్టెన్ టీమిండియా ఆటగాడిపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ఒక విధంగా అతడు చేసిన వ్యాఖ్యలు ఆ ఆటగాడిని పొగిడిన దాని కిందకే వస్తాయి. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు కంగారూ సారథి పాట్ కమ్మిన్స్ టీమిండియాకు ఉన్న అతిపెద్ద స్ట్రెంత్ గురించి చెప్పుకొచ్చాడు. ఒకే ఒక్క మాటతో భారత జట్టులో కీలక పాత్ర పోషించే ప్లేయర్ గురించి చెప్పుకొచ్చాడు. కమ్మిన్స్ ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ..”మహ్మద్ షమీ టీమిండియాకు అతిపెద్ద బలం. అతడిని అడ్డుకోవడం కష్టమే.. కానీ ప్రయత్నిస్తాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కమ్మిన్స్ షమీపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

కాగా.. వరల్డ్ కప్ 2023లో కనీవినీ ఎరుగని రీతిలో చెలరేగుతున్నాడు షమీ. ఆడిన 6 మ్యాచ్ ల్లోనే 23 వికెట్లు నేలకూల్చి.. టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు. ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ టీమిండియాకు చిరస్మరణీయ విజయాలను అందిస్తున్నాడు ఈ స్టార్ పేసర్. షమీ బౌలింగ్ తీరును టోర్నీ ప్రారంభం నుంచి కనిపెడుతూ వస్తున్నట్లున్నాడు కమ్మిన్స్. అందుకే అతడి గురించి ఇంత నొక్కి చెబుతున్నాడు. ఇక ఫైనల్ పోరుకు సిద్దమైంది నరేంద్ర మోదీ స్టేడియం. ఆదివారం(నవంబర్ 19) టీమిండియా-ఆస్ట్రేలియాలు వరల్డ్ కప్ కోసం ఢీకొనబోతున్నాయి. మరి కమ్మిన్స్ చెప్పినట్లుగానే టీమిండియా బలం షమీయేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి