SNP
IND vs AFG, Kuldeep Yadav, T20 World Cup 2024: ఆఫ్ఘనిస్థాన్‌తో సూపర్ 8 మ్యాచ్‌కు టీమిండియా రెడీ అవుతోంది. అయితే.. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి ప్లేయింగ్ 11తో బరిలోకి దిగనుందో ఇప్పుడు చూద్దాం..
IND vs AFG, Kuldeep Yadav, T20 World Cup 2024: ఆఫ్ఘనిస్థాన్‌తో సూపర్ 8 మ్యాచ్‌కు టీమిండియా రెడీ అవుతోంది. అయితే.. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి ప్లేయింగ్ 11తో బరిలోకి దిగనుందో ఇప్పుడు చూద్దాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా టీమిండియా రేపు(గురువారం) తమ తొలి సూపర్ 8 మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో ఆప్ఘనిస్థాన్‌తో మ్యాచ్ ఆడనుంది రోహిత్ సేన. అయితే.. మ్యాచ్‌ను టీమిండియా ఎంతో సీరియస్‌గా తీసుకుంటుంది. ఎందుకంటే.. ఈ టోర్నీలో ఆఫ్ఘాన్ జట్టు న్యూజిలాండ్ లాంటి స్ట్రాంగెస్ట్ టీమ్‌ను మట్టికరిపించిన విషయం మర్చిపోవద్దు. పైగా వెస్టిండీస్ పిచ్‌లపై ఈ టోర్నీలో ఇప్పటికే ఆఫ్ఘాన్ కొన్ని మ్యాచ్‌లు ఆడింది. అందుకే ఆఫ్ఘాన్‌ను అస్సలు ఏ మాత్రం తక్కువ అంచనా వేయకూడదని క్రికెట్ నిపుణులు సైతం సూచిస్తున్నారు.
సూపర్ 8లో తొలి మ్యాచ్ కావడంతో టీమిండియా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అందుకోసం జట్టులో మార్పులు చేసుకొన మరీ.. ఒక స్ట్రాంగ్ ప్లేయింగ్ 11తో ముందుకు వస్తున్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ కోసం టీమిండియా తన ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక మర్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్ రౌండర్ శివమ్ దూబేను పక్కనపెట్టి.. అతని స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందని అంచనా వేయడంతో.. జడేజా, అక్షర్ పటేల్ లాంటి స్పిన్ ఆల్ రౌండర్లతో పాటు క్వాలిటీ స్పిన్నర్‌తో బరిలోకి దిగనుంది రోహిత్ సేన.
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీనే ఈ మ్యాచ్‌లో కూడా ఆడనున్నారు. కోహ్లీ ఫామ్ అందుకుంటేనే టీమిండియాకు విజయావకాశాలు పెరుగుతాయి. ఇప్పటికే వరకు మూడు మ్యాచ్‌ల్లో కోహ్లీ 5 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, కీలకమైన సూపర్ 8లో కోహ్లీ తన ఫామ్‌ను అందుకుంటాడని అంతా భావిస్తున్నారు. అలాగే రోహిత్ శర్మ బ్యాట్ నుంచి కూడా ఒక మంచి స్కోర్ రావాల్సి ఉంది. వీరితో పాటు మిడిలార్డర్ బ్యాటర్లు ఇప్పటి వరకు చూపించిన ప్రదర్శనను కంటిన్యూ చేయాలి. అయితే.. ఎవరో ఒకరో ఇద్దరు ఆడుతున్నారు కానీ.. నిలకడగా పరుగులు చేసిన బ్యాటర్ కనిపించడం లేదు. అదే టీమిండియాకు మైనస్‌గా మారుతోంది. బౌలింగ్ గురించి పెద్దగా లోపాలు ఏం లేవు. కుల్దీప్ టీమ్‌లోకి వచ్చి తన స్పిన్ మ్యాజిక్‌ను చూపిస్తే.. తొలి సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియాకు విజయం ఖాయంగానే కనిపిస్తోంది. మరి టీమిండియా ఒక్క మార్పుతో ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Feels Kuldeep Yadav will play all the games now. pic.twitter.com/5yWSQ7lnyM
— R A T N I S H (@LoyalSachinFan) June 19, 2024