iDreamPost

క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ప్లేయర్!

క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ప్లేయర్!

సాధారణంగా క్రికెట్ లో కొంతమంది ఆటగాళ్లు ఒక స్థాయికి వచ్చాక తమ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉంటారు. కానీ కొంత మందికి అవకాశాలు రాక.. వచ్చిన వాటిని వినియోగించుకోలేక అర్ధాంతరంగా తమ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలుకుతూ ఉంటారు. తాజాగా టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు తాను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఒక పక్క రాజకీయాలతో బిజీగా ఉంటూనే ఈ ఏడాది ఫిబ్రవరి వరకు దేశవాలీ టోర్నీల్లో బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

టీమిండియా క్రికెటర్, మిడిలార్డర్ బ్యాటర్, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతున్నట్లు తన ఇన్ స్టా వేదికగా వెల్లడించాడు. గత రంజీ సీజన్ లో బెంగాల్ ను ఫైనల్ వరకు చేర్చాడు తివారి. ఇక తన రిటైర్మెంట్ గురించి తెలుపుతూ.. నేను కలలో కూడా ఊహించనివి ఇచ్చింది క్రికెట్. కష్టకాలంలో అన్ని విధాల నన్ను ఆదుకుంది. క్రికెట్ కు నేను ఎంతో రుణపడి ఉంటాను. కానీ ఇప్పుడు దానికి వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చింది. క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నాను అంటూ ఇన్ స్టా పోస్ట్ లో రాసుకొచ్చాడు మనోజ్ తివారి.

ఇక అతడి కెరీర్ విషయానికి వస్తే.. 2008-15 మధ్య టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. కానీ అనుకున్న రీతిలో అతడికి అవకాశాలు రాలేదు. ఇక వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక జట్టులో చోటును కోల్పోయాడు మనోజ్ తివారి. 37 ఏళ్ల ఈ బెంగాల్ ఆటగాడు టీమిండియా తరపున 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. వన్డేలో ఓ సెంచరీ, హాఫ్ సెంచరీతో 302 పరుగులు చేశాడు. కాగా.. టీమిండియాకు తివారి ఆడింది తక్కువ మ్యాచ్ లే అయినా.. జట్టులో తనదైన ముద్రవేశాడు. 2011లో విండీస్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో సెంచరీ (104*) చేయడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఇక ఐపీఎల్ ల్లో సైతం తనదైన ముద్రవేశాడు తివారి. 2008 నుంచి 2018 సీజన్ వరకు ఐపీఎల్ ఆడాడు మనోజ్ తివారి. ఈ రిచ్ లీగ్ లో మెుత్తం 98 మ్యాచ్ లు ఆడి 7 హాఫ్ సెంచరీలతో 1695 పరుగులు చేశాడు.


ఇదికూడా చదవండి: భారత క్రికెట్ లో విషాదం.. 2007 టీ20 ప్రపంచ కప్ విన్నింగ్ జట్టు మేనేజర్ మృతి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి