iDreamPost
android-app
ios-app

మా నాన్న మళ్లీ నవ్వుతారు.. ఫ్యాన్స్ కు క్యూట్ గా ఆన్సర్ ఇచ్చిన రోహిత్ కూతురు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూతురు సమైరా, ఫ్యాన్స్ కు ఇచ్చిన సమాధానాలు నెట్టింటా వైరల్ గా మారాయి. మా నాన్న మళ్లీ నవ్వుతారంటూ క్యూట్ గా ఇచ్చిన ఆన్సర్ కి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూతురు సమైరా, ఫ్యాన్స్ కు ఇచ్చిన సమాధానాలు నెట్టింటా వైరల్ గా మారాయి. మా నాన్న మళ్లీ నవ్వుతారంటూ క్యూట్ గా ఇచ్చిన ఆన్సర్ కి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

మా నాన్న మళ్లీ నవ్వుతారు.. ఫ్యాన్స్ కు క్యూట్ గా ఆన్సర్ ఇచ్చిన రోహిత్ కూతురు

వన్డే వరల్డ్ కప్ 2023 సమరం ముగిసిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ ఆరంభం నుంచి వరుసగా పది మ్యాచ్ లలో అదరగొట్టిన టీమిండియా ఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని చవిచూసింది. దీంతో కోట్లాది మంది భారతీయులు తీవ్ర నిరాశకు గురయ్యారు. టీమిండియా ఆటగాళ్లు గ్రౌండ్ లోనే కన్నీళ్లు పెట్టుకోవడం క్రికెట్ ఫ్యాన్స్ ను కలిచి వేసింది. కాగా టీమిండియా సారథి రోహిత్ శర్మ వరల్డ్ కప్ ఫైనల్ లో ఓటమి తర్వాత మీడియా కంట పడలేదు. అయితే హిట్ మ్యాన్ కూతురు వాళ్ల నాన్న గురించి అప్ డేట్ ఇచ్చింది. ఫ్యాన్స్ మీ నాన్న ఎలా ఉన్నారని అడగ్గా చాలా క్యూట్ గా సమాధానం ఇచ్చింది.

భాతర్ కెప్టెన్ రోహిత్ శర్మ బరిలోకి దిగారంటే ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టాల్సిందే. ఎలాంటి అటాకింగ్ బౌలింగ్ అయినా సరే తనదైన శైలిలో విరుచుకుపడి విధ్యంసం సృష్టిస్తారు. జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తారు. అయితే వరల్డ్ కప్ ఫైనల్ లో పరాజయం అనంతరం రోహిత్ బయటకు రాలేదు. ఇదే విషయమై రోహిత్ గారాల పట్టి సమైరా అతడు ఎలా ఉన్నాడో చెప్పేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నకు సమైరా బదులిస్తూ.. మా నాన్న తొందర్లోనే మళ్లీ నవ్వుతారు అని చెబుతున్న వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

ఆ వీడియోలో సమైరా తన తల్లి రితికాతో కలిసి ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొంతమంది ఫ్యాన్స్ సమైరాను పలకరించారు. హాయ్ హౌ ఆర్ యూ అని అడిగారు. ఆ తర్వాత మీ నాన్న ఎక్కడ? ఇప్పుడెలా ఉన్నారు అని అడిగారు. “అతడు తన రూమ్ లోనే ఉన్నారు. చాలా పాజిటివ్ గానే ఉన్నారు. నెల రోజుల్లో మళ్లీ నవ్వుతారు” అని సమైరా చెప్పింది. సమైరా సమాధానాలకు మురిసి పోయారు రోహిత్ ఫ్యాన్స్. ఆమె ముద్దు ముద్దు మాటలకు ముగ్దులైపోయారు. పరిచయం లేని వారు కూడా పలకరించినప్పుడు వినయంగా సమాధానాలు చెప్పడంతో రోహిత్ తన కూతురును ఎంత బాగా పెంచుతున్నారో అర్ధమవుతోందని నెటిజన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఆసిస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommarsbahisMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/