Nidhan
సక్సెస్ ఇచ్చే కిక్ కంటే ఫెయిల్యూర్ నేర్పే పాఠానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామని గొప్ప వ్యక్తులు అంటుంటారు. గెలుపు కాదు.. ఒక్కసారి ఓడి చూడు అన్నీ తెలుస్తాయని చెబుతుంటారు. టీమిండియా కూడా ఇలాగే ఒక మ్యాచ్‌లో ఘోర ఓటమిని చవిచూసింది. అయితే దానికి కుంగిపోకుండా సీరియస్‌గా తీసుకొని వరుస విజయాలతో దూసుకెళ్లింది.
సక్సెస్ ఇచ్చే కిక్ కంటే ఫెయిల్యూర్ నేర్పే పాఠానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామని గొప్ప వ్యక్తులు అంటుంటారు. గెలుపు కాదు.. ఒక్కసారి ఓడి చూడు అన్నీ తెలుస్తాయని చెబుతుంటారు. టీమిండియా కూడా ఇలాగే ఒక మ్యాచ్‌లో ఘోర ఓటమిని చవిచూసింది. అయితే దానికి కుంగిపోకుండా సీరియస్‌గా తీసుకొని వరుస విజయాలతో దూసుకెళ్లింది.
Nidhan
ఓటమి.. ఈ పదం వినేందుకు కొందరు భయపడతారు. కానీ ఇది నేర్పించే పాఠాలు అన్నీ ఇన్నీ కాదు. సక్సెస్ టెంపరరీగా జోష్ ఇస్తుందేమో కానీ ఏదీ నేర్పించదు. అదే ఓటమి చాన్నాళ్లు బాధపెట్టినా దాని నుంచి నేర్చుకునే పాఠాలు దీర్ఘకాలంలో విజయాలు సాధించడానికి, తమను తాము మరింత మెరుగుపర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. అందుకే గెలుపును నెత్తికి ఎక్కించుకోవద్దు, ఓటమికి కుంగిపోవద్దు.. నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలని పెద్దలు అంటుంటారు. దీన్ని స్పోర్ట్స్‌కు కూడా అన్వయించుకోవచ్చు. ముఖ్యంగా క్రికెట్లో గెలిచిన జట్టును ప్రశంసల్లో ముంచెత్తడం, ఓడిపోయిన టీమ్‌ను విమర్శించడం చూస్తూనే ఉంటాం. ఇలాగే టీమిండియా ఓ మ్యాచ్‌లో ఘోర ఓటమిపాలైంది. కేవలం 36 రన్స్‌కే ఆలౌట్ అయింది. ఇది జరిగి ఇవాళ్టికి సరిగ్గా మూడేళ్లు. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమ్ తక్కువ స్కోరుకే ఆలౌట్ అవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు.
2020-21లో ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లింది భారత్. ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కేవలం 36 పరుగులకే కుప్పకూలింది. పృథ్వీ షా (4), మయాంక్ అగర్వాల్ (9), ఛటేశ్వర్ పుజారా (0), విరాట్ కోహ్లీ (4), అజింక్యా రహానె (0), హనుమ విహారి (8), వృద్ధిమాన్ సాహా (4) లాంటి టాప్ బ్యాటర్లలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. జోష్ హేజల్‌వుడ్ (5 వికెట్లు), పాట్ కమిన్స్ (4 వికెట్లు) నిప్పులు చెరిగే బంతులను ఎదుర్కోలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో టీమిండియా బ్యాటర్లు స్వదేశంలోనే పులులు.. ఫారెన్ పిచ్‌ల మీద వాళ్లు రన్స్ చేయలేరనే అపప్రదను మరోమారు మూటగట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్ దీన్నో ఛాలెంజ్‌గా తీసుకుంది. తీవ్ర విమర్శలు వచ్చినా బెదరకుండా మరింత కసి, పట్టుదలతో ఆడింది. తొలి టెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియా.. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని రీతిలో సూపర్బ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చింది. తర్వాతి మూడు టెస్టుల్లో రెండింట్లో నెగ్గి.. ఒకదాన్ని డ్రా చేసుకుంది.
ఆ సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకోవడం ద్వారా ఆసీస్ గడ్డ మీద టెస్ట్ సిరీస్ నెగ్గిన తొలి ఆసియా జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఇక, తమను 36కే ఆలౌట్ చేసిన హేజల్‌వుడ్, కమిన్స్ బౌలింగ్‌ను సిరీస్ మొత్తం భారత్ బ్యాటర్లు ఓ ఆటాడుకున్నారు. ఆ తర్వాత వరుస టెస్టుల్లో నెగ్గుతూ దుమ్మురేపింది. అయితే దీనంతటికీ ఫస్ట్ టెస్ట్‌లో తక్కువ స్కోరుకు ఆలౌట్ అవడమే కారణమని చెప్పాలి. ఆ ఫెయిల్యూర్‌ను సవాల్‌గా తీసుకొని ఆడారు కాబట్టే తర్వాత కాలంలో వరుస సక్సెస్‌లు వచ్చాయి. ఆ సిరీస్‌లో అద్భుతమైన ఆటతీరుతో కోట్లాది మంది భారతీయుల్ని టీమిండియా ప్లేయర్లు ఇన్స్పైర్ చేశారు. గెలుపే కాదు.. ఓటమిని కూడా సమానంగా తీసుకొని పోరాడాలని మన జట్టు నేర్పిన పాఠాన్ని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు. మరి.. కంగారూ టెస్ట్ సిరీస్-2021 విశేషాలు ఇంకేమైనా మీరు పంచుకోవాలని అనిపిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో సెకండ్ వన్డే.. మూడు మార్పులతో బరిలోకి టీమిండియా!
India bowled out for 36 on this day 3 years ago.
– A great story of a comeback after that which inspired millions, India went on to win the series. pic.twitter.com/hKTNjo09CU
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 19, 2023