iDreamPost

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బాబే – నేడు అప్పులో అంటూ రివర్స్ రాగం.

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బాబే – నేడు అప్పులో అంటూ రివర్స్ రాగం.

వై.యస్.ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి నేటి వరకు 80వేల కోట్ల అప్పు చేసిందని స్వయంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ మాజీ ఫైనాన్స్ మినిస్టర్ ఎనమల రామ కృష్ణుడు కూడా మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు . వాస్తవానికి ఇది పచ్చి అబద్దం అని ప్రజలను కావాలనే తెలుగుదేశం వారు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ,రాష్ట్రానికి అప్పు ఎంత కావాలంటే అంత రాదు అని, రాష్ట్ర జిఎస్‌డిపి ప్రకారం అప్పులు తీసుకునేందుకు అనుమతి ఉంటుందని . ‘‘ఎఫ్‌ఆర్‌బిఎం’’ నిబందనల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఏటా చేసే అప్పుల శాతం 3% మించరాదని నిబంధన ఉన్నప్పుడు అంత అప్పు ప్రభుత్వం తీసుకుని వచ్చే ఆస్కారం లేదని, పైగా ఇదే యనమల గారు జగన్ కి ఎక్కడా అప్పు పుట్టే అవకాశమే లేదు అని చెప్పారని ఈ విషయం తెలుగుదేశం నేతలు తెలిసినా ప్రభుత్వం పై కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆర్ధిక నిపుణులు చెబుతున్న మాట.

నిజానికి 2018-19లో గత ప్రభుత్వం 38,251.04 కోట్ల అప్పు చేస్తే ఈ ప్రభుత్వం 45వేల కోట్లు చిల్లర అప్పు చేసిందని ఇది కొంచెం అటూ ఇటూగా ఉంటుందని, ఇది కూడా నిర్ధారణ అయిన అప్పు కాదని పూర్తి లెక్కలు వచ్చే సరికి ఇంకా తగ్గే అవకాశం కూడా ఉందని, ఇలా రావడానికి కూడా ‘‘ఎఫ్‌ఆర్‌బిఎం’’ ప్రకారం గతంతో పోల్చితే స్తూల ఉత్పత్తి పెరిగిన కారణంగా అవకాశం కలిగిందని, ఏ ప్రభుత్వం అయినా ఇది చేసేదే అని వాస్తవాలు ఇలా ఉంటే అసత్య ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం తెలుగుదేశం నేతలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నిజానికి గత ప్రభుత్వ హయాంలోనే ఆర్ధిక క్రమశిక్షణ పూర్తిగా దెబ్బతిన్న విషయం అందరికి తెలిసిన విషయమే, ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని సైతం ఉల్లంగించి అమరావతి బాండ్ల రూపంలో 2,000 కోట్లు పైగా సేకరించారు, అమరావతి బాండ్ల ద్వారా నిధులను సేకరించడం కోసం 10.32% వడ్డీ చెల్లించాలని నిర్ణయించడంతో అసలు కంటే వడ్డీ ఎక్కువయ్యేలా చేసిన ఘనత గత ప్రభుత్వానిది, అంతే కాకుండా చంద్రబాబు హయాoలో డిస్కంలకి పెట్టిన అప్పు 30,000 కోట్ల, పెండింగ్ పెట్టిన కాంట్రాక్ట్ బిల్లులు 45,000 కోట్ల , ఫీజు రీఇంబర్మెంట్ బకాయిలు, ఇలా మొత్తంగా అదనంగా ఈ ప్రభుత్వం పై చంద్రబాబు వేసి పోయిన బారం మొత్తంగా చూస్తే.. 70,000 కోట్ల పైనే.

ఇక జగన్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలని 90% హామీలను నేరవేరిస్తు ఇప్పటికే 40,139 వేల కోట్ల రూపాయలు సంక్షేమ పధకాలకు ఖర్చు పెట్టారు. దీని ద్వారా రాష్ట్రంలో సుమారు 3.57 కోట్ల మందికి నేరుగా లబ్ధి చేకుర్చారు ,  అలాగే చంద్రబాబు హయాంలో డిస్కం లకి పెట్టిన 30,000 కోట్ల అప్పులో ఇప్పటి వరకూ జగన్ సర్కార్ 7,000 కోట్లు చెల్లించింది , పెండింగ్ పెట్టిన ఫీజు రీఇంబర్మెంట్ లో 1800 కోట్లు చెల్లించారు, పెండింగ్ పెట్టిన 45,000 కోట్ల కాంట్రాక్ట్ బిల్లుల్లో ఇప్పటి వరకూ జగన్ క్లియర్ చేసిన మొత్తం దాదాపు 25,000 కోట్లు ఇలా ఒక పక్క ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే గత ప్రభుత్వం లో చేసిన తప్పుల వలన గాడి తప్పిన ఆర్ధిక పరిస్థితికి తిరిగి జీవం పోసే ప్రయత్నం చేస్తున్నారు జగన్.

2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగాక నాటికి ఉమ్మడి రాష్ట్ర అప్పు – లక్షా 66 వేల కోట్లుగా తేల్చారు. రాష్ట్ర జనాభా ప్రకారం 58% ఆంధ్ర ప్రదేశ్, 42% తెలంగాణకు అప్పుని విభజించగా, ఆంధ్ర ప్రదేశ్ 13 జిల్లాల భాగానికి 96 వేల కోట్ల అప్పుని పంచారు. 96 వేల కోట్లతో ప్రారంభమైన నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగా, 2019 ఎన్నికల్లో ఆయన దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు 96వేల కోట్ల నుండి 3.65 లక్షల కోట్లు కు చేర్చారు. నిజానికి ఆంధ్రప్రదేశ రాష్ట్రం అప్పుల ముప్పులో ఉందని 2016 లోనే కాగ్ ( కంట్రొలర్ అండ్ ఆడిట్ జనరల్) తన నివేదికలో హెచ్చరించింది. రాష్ట్రంలో అప్పులు ఆదాయం మధ్య సమతుల్యం తప్పుతుందని హెచ్చరించింది కూడా. 58 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో మన వాటాకి వచ్చిన అప్పు 96వేల కోట్లు అయితే, 2014 నుండి 2019 వరకు 5 ఏళ్లలో చంద్రబాబు 3.65 లక్షలకోట్లు అప్పు చేసి వెళ్ళారు. అంటే రాష్ట్రంలో సగటు మనిషి నెత్తి మీద 42,500 భారం మోపి వెళ్ళారు.

మాట్లాడితే సంపద సృష్టించా అని చెప్పుకునే చంద్రబాబుని అంత డబ్బుని ఏం చేశారు అని అడిగితే ఇప్పటికి ఆయన నుండి సమాధానం దొరకదు కానీ ఒక పక్క చెప్పిన హామీ చెప్పినట్టుగా ముఖ్యమంత్రి అయిన ఏడాదిలోనే 90% అమలు చేయడంతో పాటు రాష్ట్ర స్తూల ఉత్పత్తి పెంచి చిందరవందర అయిన ఆర్దిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్న జగన్ పై ఇలా నిందలు మోపడం సరైన పద్దతి కాదనే భావన సర్వత్ర వినిపిస్తున్నది . లోపాలు ఉన్నప్పడు ప్రతిపక్షం ఎత్తి చూపడంలో తప్పులేదు కాని అటు ప్రజలను గందరగోళ పరిచి ఇటు ప్రభుత్వానికి అడ్డు పడుతూ తెలుగుదేశం చేస్తున్న హేయమైన రాజకీయం పై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి