iDreamPost

బెడిసికొట్టిన టీడీపీ వ్యూహం

బెడిసికొట్టిన టీడీపీ వ్యూహం

చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూల్‌ 71 కింద నోటీస్‌ ఇచ్చి చర్చకు పట్టుబట్టిన టీడీపీ ఎమ్మెల్సీలు చైర్మన్‌ చర్చకు అనుమతించడంతో ఇక రాజధాని వికేంద్రీకరణ బిల్లు తిరస్కరణకు గురైనట్లేనని ప్రచారం చేశారు.

Read Also: మండలి బిల్లును తిరస్కరించగలదా ?

సీనియర్‌ నాయకుడు, మాజీ స్పీకర్‌ అయిన యనమల రామకృష్ణుడు రూల్‌ 71 కింద ఇచ్చిన నోటీసును సభ ఆమోదించడంతో దానిలో పెట్టిన సవరణలను కూడా ఆమోదం పొందినట్లేనని, ఇక వికేంద్రీకరణ బిల్లుపై చర్చ ముగిసినట్లేనని చెప్పారు. మరోవైపు అధికారపక్షం ఈ రోజు మండలిలో వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరుగుతుందని చెప్పింది. అనేక తర్జనభర్జనల తర్వాత మండలి చైర్మన్‌ షరీఫ్‌ వికేంద్రీకరణ బిల్లుపై చర్చను ప్రారంభించారు. దీంతో టీడీపీ ప్రయోగించిన రూల్‌ 71 ఎత్తుగడ నిష్ఫలమైంది.

ఈ బిల్లుపై చైర్మన్‌ మండలిలో నాలుగు గంటల పాటు చర్చకు అనుమతించారు. ఈ సాంయంత్రం ఈ బిల్లుపై మండలి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి