iDreamPost

ఖైదీ నెంబర్ 1573 కేటాయించిన జైలు అధికారులు

ఖైదీ నెంబర్ 1573 కేటాయించిన జైలు అధికారులు

పైల్స్ తో బాధపడుతున్న అచ్చెన్నాయుడిని హాస్పిటల్ తరలించిన పోలీసులు . పరామర్శించటానికి వస్తున్న బాబు .

ESI కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా నిర్ధారించి నిన్న ఉదయం అరెస్ట్ చేసిన మాజీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడుని రాత్రికి విజయవాడ ఏసీబీ ఆఫీసుకి తరలించడం తెలిసిందే . అయితే పైల్స్ తో బాధపడుతూ ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడుకి రక్తస్రావం కావడంతో ఏసీబీ పోలీసులు ESI హాస్పిటల్ నుండి డాక్టర్స్ ని పిలిపించడం వారు పైల్స్ పరిశీలించి రక్తస్రావం కాకుండా తాత్కాలిక వైద్యం చేసి కోవిడ్ టెస్ట్ కి రిఫర్ చేయడంతో అచ్చెన్నాయుడుని ESI హాస్పిటల్ కి తరలించి కోవిడ్ టెస్ట్ చేయించి మరలా ఏసీబీ కోర్ట్ కి తరలించి జడ్జ్ తో వీడియో కాన్ఫరెన్స్ కి ప్రయత్నించగా సాంకేతిక సమస్యల వలన వీలు కాక మంగళగిరి లోని జడ్జ్ నివాసానికి తరలించి జడ్జ్ ఎదుట హాజరు పరచటం జరిగింది .

కేసు ప్రాధమిక సమాచారం పరిశీలించిన జడ్జ్ రిమాండ్ విధించి జైలుకి తరలించమని ఆదేశిస్తూ నిందితుడు పైల్స్ తో బాధపడుతున్నందున జైలు డాక్టర్స్ పరిశీలించిన పిమ్మట వైద్య సహాయం అవసరమైతే జైలు నుండి హాస్పిటల్ కి తరలించమని ఆదేశించిన మేరకు అచ్చెన్నాయుడిని జైలుకు తరలించగా ఖైదు రిజిస్టర్ లో నమోదు చేసి 1573 నెంబర్ కేటాయించడం జరిగినది .

అనంతరం జైలు వైద్యులు పైల్స్ పరిశీలించిన పిమ్మట హాస్పిటల్ కి రిఫర్ చేయగా గుంటూరు జిజిహెచ్ కి వైద్యం నిమిత్తం తరలించారు . అచ్చెన్నాయుడి అరెస్ట్ వార్త తెలియగానే తీవ్రంగా స్పందించిన చంద్రబాబు పైల్స్ తో బాధపడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేస్తారా అంటూ ఆందోళన వ్యక్తం చేయడం పాఠకులకు విదితమే . కాగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడిని పరామర్శించటానికి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు గుంటూరు జిజిహెచ్ కి రానున్నారని సమాచారం .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి