iDreamPost

Covid-19 booster dose ఆరునెల‌ల‌కే బూస్ట‌ర్ డోసు

Covid-19 booster dose ఆరునెల‌ల‌కే బూస్ట‌ర్ డోసు

దేశవ్యాప్తంగా పెరుగుతున్న క‌రోనా కేసుల‌ను అడ్డుకోవ‌డానికి కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రెండు డోజుల వ్యాక్సిన్ త‌ర్వాత బూస్ట్ డోసుల త‌ర్వాత వేసుకొనే బూస్ట‌ర్ డోసు వ్య‌వ‌ధిని 6నెల‌ల‌కు త‌గ్గించాల‌ని నేష‌న‌ల్ టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేష‌న్ ( NTAGI ) స్టాండింగ్ టెక్నికల్ సబ్-కమిటీ (STSC) గత నెలలో సిఫార్సు చేసిన త‌ర్వాత ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అంటే, రెండో డోజు తీసుకొని 6నెల‌లు పూర్త‌యిన వారికి బూస్ట‌ర్ డోసు అందించ‌నున్నారు.

అందువల్ల, 18-59 సంవత్సరాల నుండి అంద‌రికీ టీకా కేంద్రంలో రెండవ డోస్ ఇచ్చిన తేదీ నుండి ఆరు నెలలు లేదా 26 వారాలు పూర్తయిన త‌ర్వాత బూస్ట‌ర్ డోసును ఇవ్వ‌నున్నారు.

60 ఏళ్లు పైబడిన వారంద‌రితో పాటు ఆరోగ్య సంరక్షణ వ‌ర్క‌ర్లు (హెచ్‌సిడబ్ల్యులు) , ఫ్రంట్‌లైన్ వర్కర్లు (ఎఫ్‌ఎల్‌డబ్ల్యులు) ప్రభుత్వ టీకా కేంద్రాలలో ఉచితంగా బూస్ట‌ర్ టీకాను ఇవ్వ‌నున్నారు. ఈ మేర‌కు CoWIN మార్పులు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి