iDreamPost

అనంతపురంలో తీవ్ర స్థాయికి చేరిన TDP నేతల విబేధాలు!

TDP Leaders Clash: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది..టీడీపీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతల మధ్య విబేధాలు బయటపడగా.. తాజాగా అనంతపురం జిల్లాలో కనిపించాయి.

TDP Leaders Clash: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది..టీడీపీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతల మధ్య విబేధాలు బయటపడగా.. తాజాగా అనంతపురం జిల్లాలో కనిపించాయి.

అనంతపురంలో తీవ్ర స్థాయికి చేరిన TDP నేతల విబేధాలు!

టీడీపీ,జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజవర్గాలో టీడీపీ,జనసేన నేతల మధ్య ఫైట్ జరగుతుంది. ఇది ఇలా ఉంటే.. మరికొన్ని చోట్ల టీడీపీ నేతల మధ్యనే కోల్డ్ వార్ నడుస్తోంది. మైలవరం, పెనమలూరు, రాజమండ్రి, కావలి..వంటి పలు నియోజవర్గల్లో టీడీపీలో వర్గ విబేధాలు కనిపిస్తోన్నాయి. కొందరు నేతలు అయితే ఏకంగా రోడ్డెక్కెకి మరీ ఫైటింగ్ చేసుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీలో వర్గ పోరు రచ్చకెక్కింది.

లోక్ సభ, శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రతిపక్ష టీడీపీలో కోల్డ్ వార్ కాస్తా ఓపెన్ వార్ గా మారింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విబేధాలు తీవ్ర స్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి, ప్రస్తుత ధర్మవరం టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ మధ్య మరోసారి విబేధాలు బయటపడ్డాయి. ఇంతకాలం వారి మధ్య కోల్డ్ వార్ నడిచేది. అలానే తరచూ పలు సందర్భాలో వీరి విబేధాలు కనిపించాయి. తాజాగా మరోసారి వీరి విభేదాలు బయటపడ్డాయి.

తాజాగా బత్తలపల్లిలో వరదాపురం సూరి వర్గీయుల వాహనాలను పరిటాల శ్రీరామ్ అనుచరులు ధ్వంసం చేశారు. దీంతో పరిటాల, సూరి వర్గీయులు మధ్య వాగ్వాదం జరిగింది. అంతేకాక ఒకరికొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో వరదాపురం సూరి వర్గీయులు ప్రయాణిస్తున్న 10 నుంచి 15 వాహనాలు ధ్వంసం అయ్యాయి. అలానే నలుగురు సూరి వర్గీయులకు గాయాలయ్యాయి. దీంతో కాసేపు స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.  పెనుకొండలో సోమవారం సాయంత్రం చంద్రబాబు ‘రా.. కదలిరా’ సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ సభకు  వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వరదాపురం సూరి గతంలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ధర్మవరం నుంచి గెలిచారు.  ప్రస్తుతం వరదాపురం సూరి బీజేపీలో కొనసాగుతున్నారు. సూరి వర్గీయులు చంద్రబాబు సభకు వెళ్లకూడదంటూ పరిటాల శ్రీరామ్ వర్గీయులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇక ధర్మవరం టీడీపీ టికెట్‌ కోసం కొంతకాలంగా పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి కోల్డ్ వార్ నడుస్తోన్న సంగతి విదితమే. మరి..ధర్మవరంలో టీడీపీలో జరుగుతున్న ఈ పరిణామాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి