iDreamPost

భాదితుల భావోద్వేగంతోనూ రాజకీయమేనా బాబు ?

భాదితుల భావోద్వేగంతోనూ రాజకీయమేనా బాబు ?

సంఘటన ఏదైనా , పరిస్తితి ఎలా ఉన్నా కొంత మంది నాయకులు రాజకీయమే పరమావదిగా వ్యవహరిస్తారు. ఘటనలో ఉన్న తీవ్రత సున్నితత్వంతో పనిలేకుండా లబ్దిపొందాలని చూస్తారు, అటువంటి నాయకుల్లో ముందు వరసలో ఆంద్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వుంటారు అని చెప్పడలో సందేహం లేదు. సుమారు 42ఏళ్ల పాటు రాజకీయ జీవితం గడిపిన ఆయన అధికారంలో ఉండటానికి వేసిన ఎత్తులతో కరడుకట్టిన వ్యక్తిగా తయారయ్యారు. అధికారం కోసం ఎలాంటి పరిస్థితినైనా తనకి అనుకూలంగా మల్చుకోవాలనే ఆలోచనతో అత్యంత సున్నితమైన అంశాలైనా , ప్రజలు భావోద్వేగంతో కూడిన అంశాల పైనా నిజాలతో పనిలేకుండా నిందారోపణాలు చేయడానికి కూడా వెనకాడటంలేదు. తప్పుడు సమాచారంతో ప్రజలని రెచ్చకొట్టి అయినా సరే తిరిగి అధికారంలోకి రావాలనే ఆత్రుత ఈ మద్య ఆయనలో మరీ ఎక్కువ గా కనపడుతుంది.

విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటన అత్యంత దురదృష్టకరమైన అంశం. కేవలం ఫ్యాక్టరీ యజమాని నిర్లక్ష్యానికి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది ఆసుపత్రి పాలయ్యారు. నిజానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సమర్ధవంతంగా సమయస్పూర్తితో వ్యవహరించి అధికారులని అప్రమత్తం చేయడంతో ప్రాణ నష్టం తీవ్రత కొంతవరకు తగ్గించగలిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కూడా స్వయంగా వచ్చి భాదితులని కలిసి పరామర్శించడం తో పాటు ఇప్పటి వరకు దేశం లో ఎవ్వరు చేయని విధంగా భారీ నష్ట పరిహారం ప్రకటించి రోజుల వ్యవధిలో భాదితులకు అందచేశారు. ప్రమాదానికి సంభందించిన వివరాలను అధికారులనుండి తెలుసుకుని పూర్తి స్థాయి సమగ్ర దర్యాప్తుకి ఆదేశించారు, కంపెనీమీద కేసు నమోదు చేయించారు. నివేదికలు వచ్చే వరకు కంపెనీ తెరవడానికి వీల్లేదని చెప్పారు. నివేదిక రాగానే అవసరమైతే కంపెనీను జనావాసాలకు దూరంగా తరలిస్తాం అని, చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పి భాదితులకు బరోసా కల్పించారు.

నిజానికి ఈ ఫ్యాక్టరీకి సంభందించిన అనుమతుల దగ్గరనుండి , భూ కేటాయింపులు , నాణ్యత పరిక్షల వరకు జరిగిన తప్పులన్నీ తెలుగుదేశం పాలనా హయాం వైపు చూపుతున్నా , జరిగిన దుర్ఘటనలో ఉన్న తీవ్రత దృష్ట్య భాదితులను పక్కకు నెట్టి ఈ సమయంలో నిందారోపణల రాజకీయం చేయడం నైతికత కాదనే మానవాతా దృక్పదంతో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టి శ్రేణులు ఆ విషయాల జోలికి వెళ్లకుండా పూర్తిగా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు . అయితే తెలుగుదేశం నేతలు మాత్రం జరిగిన దుర్ఘటనని ఎలాగైనా ప్రభుత్వం మీద రుద్ది అప్రధిష్ట పాలు చేయాలనే ఆలోచనతో ఆరోపణలకు దిగారు. ముఖ్యంగా తెలుగుదేశం రాజకీయానికి పరాకాష్టగా ఏకంగా గ్యాస్ ప్రమాదంలో మృతి చెందిన బాలిక తల్లిపై జగన్ ప్రభుత్వం కేసు పెట్టింది అని అడ్డగోలు ఆరోపణాలకు దిగారు ప్రతిపక్షనేత చంద్రబాబు.

జరిగిన దుర్ఘటనకు పూర్తిగా తెలుగుదేశం పాలన హయాంలో అవలంభించిన నిర్లక్షమే ప్రధాన కారణం అయిన , భాదితులకి జగన్ అండా నిలబడి పోయిన ప్రాణాలు నేను తీసుకుని రాలేను అని చెబుతూ, ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా ఉండాలంటే కంపెనీలకి బుద్ది వచ్చేలా నష్ట పరిహారం అందిస్తాను అని గతం లో చెప్పిన మాదిరే వ్యవహరించి భాదితులకి నష్ట పరిహారం అందించారు. ఎంత నష్ట పరిహారం అoదుకున్నా భాదితుల భాద తీర్చలేనిది కాబట్టి వారిలో కొందరు విగతజీవులుగా ఉన్నవారి రక్త సoభందీకులను చూసి భావోద్వేగానికి లోనై కంపెనీ ముందు ధర్నాకు దిగారు. అయితే ముఖ్యమంత్రి జగన్ హామీ మేరకు మీకు తప్పక న్యాయం జరుగుతుంది అని చెప్పి పొలీసులు వారికి నచ్చ చెప్పి తిరిగి పంపించారు. అయితే జరిగిన ఈ ఘటనని ఉదహరిస్తూ జగన్ ప్రభుత్వం పై వారికి వ్యతిరేకత వచ్చినట్టు చిత్రీకరించేందుకు బాబుకు మద్దతు పలికే మీడియా విశ్వప్రయత్నం చేసింది.

చంద్రబాబు మరో ముoదడుగు వేసి గ్యాస్ లీక్ ప్రమాదంలో కుమార్తెను పోగొట్టుకున్న ఒక తల్లి తమకి న్యాయం చేయమని అడిగితే కేసు పెడతరా, అమె చేసిన నేరం ఎంటి అని భావోద్వేగానికి సంబందించిన ఆ ఘటనను కూడా తన రాజకీయానికి వాడుకుని ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేశారు. నిజానికి చంద్రబాబు ఉదహరించిన గ్యాస్ ప్రమాధంలో చనిపోయిన బాలిక గ్రీష్మా తల్లి లలిత, కూతురు పోగొట్టుకున్న భాదలో కంపెనీ ముందు ధర్నాకు దిగితే వారికి నచ్చ చెప్పి తిరిగి పొలీసువారు పంపించారని అయితే ఆమెను అరెస్టు చేసినట్టు చంద్రబాబు అనడం , ఆమెను రిమాండుకు తరలించినట్టు సోషల్ మీడియా మాద్యమాల్లో ప్రతిపక్ష మద్దతు దార్లు ప్రచారం చేయడం శోచనియం అని, చెప్పుకొచ్చారు.

ఇలా ఒక సంఘటనలో ఉన్న తీవ్రతతో సంభందం లేకుండా రాజకీయమే పరమావదిగా చంద్రబాబు రాజకీయ లబ్ది పొందాలని చూడటం ఆయన మనస్తత్వానికి నిదర్శనం అని, ఆయన హయాంలో చూపిన నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఘటనలలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినా కొంచెం కూడా భాదలేకుండా రాజకీయాలకి దిగడం చంద్రబాబు లాంటి రాజకీయనేతకే సాధ్యం అని, ఎక్కడ తన పై మరక పడుతోందో అనే కారణ తో ముందుగానే ఎదుటువారిపై మరకవేసే బాబు మనస్తత్వం మరోసారి ఈ రూపంలో బయటపడిందని రాజకీయాలను నిశితంగా గమనించే వారు చెబుతున్న మాట .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి