iDreamPost

19 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా.. TCS నుంచి వేల మంది ఉద్యోగులు ఔట్

  • Published Apr 13, 2024 | 8:42 AMUpdated Apr 13, 2024 | 8:42 AM

దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ ప్రారంభించిన 19 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా జరిగింది అంటున్నారు. ఇంతకు ఏమైందంటే..

దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ ప్రారంభించిన 19 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా జరిగింది అంటున్నారు. ఇంతకు ఏమైందంటే..

  • Published Apr 13, 2024 | 8:42 AMUpdated Apr 13, 2024 | 8:42 AM
19 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా.. TCS నుంచి వేల మంది ఉద్యోగులు ఔట్

మన సమాజంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు ఎంత క్రేజ్ ఉందో అలానే కొన్ని టెక్ కంపెనీలకు కూడా ఉంది. వాటిల్లో జాబ్ వస్తే ఇక భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి భయం ఉండదని భావిస్తారు. అలాంటి కంపెనీల్లో టీసీఎస్ ముందు వరుసలో ఉంటుంది. మంచి వేతనం, పని వాతావరణం కూడా చాలా బాగా ఉంటుంది. అందుకే చాలా మంది టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తారు. అందులో జాబ్ వస్తే చాలనుకుంటారు. ఇక గత కొన్నాళ్లుగా టెక్ కంపెనీలు.. ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. కానీ టీసీఎస్ మాత్రం ఇప్పటి వరకు అలాంటి పని చేయలేదు. కానీ తాజాగా టీసీఎస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దశాబ్దాల చరిత్రలో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్ అంటున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే..

టీసీఎస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కంపెనీని 2004లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే ఈ 19 ఏళ్లలో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య ప్రతి ఆర్థిక సంవత్సరం పెరుగుతూ వస్తుంది. కానీ తొలిసారిగా ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) అందుకు భిన్నమైన పరిస్థితి తలెత్తింది. ఈ ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ లో ఉద్యోగుల సంఖ్య పడిపోయింది. అది కూడా పదులు, వందల్లో కాదు.. ఏకంగా వేల సంఖ్యలో.

TCS

అంటే కంపెనీ ప్రారంభించిన 19 సంవత్సరాల్లో తొలిసారిగా ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు తగ్గిపోయిందన్నమాట. ఏప్రిల్ 12న అనగా శుక్రవారం నాడు కంపెనీ జనవరి-మార్చి 3 నెలల కాలానికిగానూ త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించింది. వీటిల్లో టీసీఎస్ లాభం, ఆదాయం భారీగా పెరిగింది. అలానే మంచి పనితీరు కనబర్చిన ఉద్యోగులకు.. డబుల్ డిజిట్ ఇంక్రిమెంట్స్ కూడా ఇస్తామని వెల్లడించింది. ఈ క్రమంలోనే ఉద్యోగుల సంఖ్యపైనా టీసీఎస్ కీలక ప్రకటన చేసింది.

2023-24 ఆర్థిక సంవత్సరం మొత్తానికిగానూ.. టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 13,249 తగ్గింది. ఒక్క ఏడాదిలోనే ఇంత మంది ఉద్యోగులు కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోయారన్న మాట. ఇక ప్రస్తుత త్రైమాసికానికిగానూ ఉద్యోగులు 1759 మంది తగ్గిపోయారు. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య మొత్తంగా 22,600 పెరిగింది. అంతకుముందు అనగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.03 లక్షల మంది కొత్తగా టీసీఎస్ లో చేరడం విశేషం.

ఇదిలా ఉంచితే ప్రస్తుతం టీసీఎస్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2024, మార్చి 31 నాటికి 6,01,546 కు చేరింది. వరుసగా మూడో త్రైమాసికంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య తగ్గింది. టెక్ కంపెనీల్లో ఉద్యోగులను తొలగిస్తుండగా.. టీసీఎస్ లో మాత్రం అందుకు భిన్నంగా వేల సంఖ్యలో ఉద్యోగులు తమంతట తామే బయటకు వెళ్లిపోవడం విశేషం. ఇక టీసీఎస్ ఈ ఏడాది ఉద్యోగులకు జీతాలు పెంచింది. 4.5 నుంచి 7 శాతం శ్రేణిలో వార్షిక ఇంక్రిమెంట్‌లను ప్రకటించింది. టాప్ పెర్ఫార్మర్‌లకు రెండంకెల పెంపుదల ఉంటుందని ప్రకటించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి