iDreamPost

ఇండస్ట్రీలో విషాదం.. జైలర్ నటుడు కన్నుమూత!

  • Author ajaykrishna Updated - 12:04 PM, Fri - 8 September 23
  • Author ajaykrishna Updated - 12:04 PM, Fri - 8 September 23
ఇండస్ట్రీలో విషాదం.. జైలర్ నటుడు కన్నుమూత!

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. పాపులర్ తమిళ నటుడు, దర్శకుడు జి. మరిముత్తు కన్నుమూశారు. సెప్టెంబర్ 8న ఉదయం ‘ఎత్తిర్ నీచల్’ అనే టీవీ సీరియల్ కి డబ్బింగ్ చెబుతూ.. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయన్ని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారని సమాచారం. ప్రస్తుతం మరిముత్తు వయసు 58 ఏళ్లు. కాగా.. చివరిగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ మూవీలో కనిపించారు. ఎన్నో సినిమాలలో కీలకమైన పాత్రలు పోషించిన మరిముత్తు ఆకస్మికంగా చనిపోవడం తమిళ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

మరిముత్తు నటుడిగా తమిళ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ.. నటుడిగా కంటే ముందు ఆయన దర్శకుడిగా అడుగు పెట్టారు. ఇప్పటిదాకా మరిముత్తు దాదాపు 50కి పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం ఆయన ఆకస్మిక మరణం పట్ల సోషల్ మీడియా వేదికగా సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ సంతాపం తెలియజేస్తున్నారు. ఇక మరిముత్తు 90లలోనే తన స్వస్థలమైన తేని ప్రాంతాన్ని విడిచిపెట్టి.. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చారు. ఇండస్ట్రీలో అవకాశాలు రాకముందు హోటల్స్ లో వెయిటర్ గా కూడా వర్క్ చేసినట్లు తెలుస్తోంది. అదే టైమ్ లో సాహిత్యంపై ఉన్న మక్కువ.. మరిముత్తుని పాపులర్ లిరిసిస్ట్ వైరముత్తుతో పరిచయం ఏర్పరచింది.

అలా వైరముత్తు పరిచయంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ‘అరణ్మనై కిలి’ (1993), ‘ఎల్లమే ఎన్ రసతన్’ (1995) లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మెల్లగా మణిరత్నం, వసంత్, సీమాన్, SJ సూర్య లాంటి స్టార్ డైరెక్టర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు మరిముత్తు. చివరికి 2008లో ‘కన్నుమ్ కన్నుమ్’ అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత నటుడిగా మారిన మరిముత్తు.. ఓవైపు యాక్టింగ్ చేస్తూనే.. 2014లో మలయాళ ‘చాప్పా కురిషు’ మూవీని ‘పులివాల్’ పేరుతో రీమేక్ చేశారు. నటుడిగా మరిముత్తు.. ‘యుద్ధం సే’ (2011), ‘ఆరోహణం’ (2012), ‘నిమిర్ందు నిల్’ (2014), ‘కొంబన్’ (2015), ‘మరుదు’, ‘కత్తి సండై’ (2016) లాంటి సినిమాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి