iDreamPost
android-app
ios-app

Ravindar: ఆస్ప్రతిలో చేరిన రవీందర్‌.. ఐసీయూలో చికిత్స!

రవీందర్‌ చం‍ద్రశేఖర్‌ కొన్ని నెలల క్రితం బెయిల్‌ ద్వారా బయటకు వచ్చారు. తాజాగా, ఆయన ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు.

రవీందర్‌ చం‍ద్రశేఖర్‌ కొన్ని నెలల క్రితం బెయిల్‌ ద్వారా బయటకు వచ్చారు. తాజాగా, ఆయన ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు.

Ravindar: ఆస్ప్రతిలో చేరిన రవీందర్‌.. ఐసీయూలో చికిత్స!

రవీందర్‌ చంద్రశేఖరన్‌- మహాలక్ష్మిల జంట గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. పెళ్లితో ఈ జంట దేశ వ్యాప్తంగా చాలా ఫేమస్‌ అయింది. రవీందర్‌ ఆకారమే ఈ జంట వార్తల్లో నిలవడానికి ప్రధాన కారణం. ఈ పెళ్లి ఇద్దరికీ రెండవది. మహాలక్ష్మికి అప్పటికే పిల్లలు కూడా ఉన్నారు. మహాలక్ష్మి కేవలం డబ్బు కోసమే రవీందర్‌ను పెళ్లి చేసుకుందన్న ప్రచారం బాగా మొదలైంది. కొన్ని నెలల క్రితం రవీందర్‌ ఓ చీటింగ్‌ కేసులో జైలు పాలయ్యాడు.

అతడు జైల్లో ఉండగా ఇద్దరి పెళ్లిపై చాలా రకాల వార్తలు వచ్చాయి. మహాలక్ష్మి రవీందర్‌కు విడాకులు ఇవ్వబోతోందని కూడా టాక్‌ నడిచింది. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. రవీందర్‌ బయటకు రావటం.. మళ్లీ ఇ‍ద్దరూ అన్యోన్యంగా కాపురం చేసుకోవటం జరుగుతూ ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను మహాలక్ష్మి తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేస్తూ ఉన్నారు. అవి కాస్తా వైరల్‌ అవుతూ ఉన్నాయి.

Ravinder in ICU

ఇక, అసలు విషయానికి వస్తే.. రవీందర్‌ తాజాగా అనారోగ్యానికి గురయ్యారు. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వారం రోజులుగా చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఊపిరి తీసుకోలేని పరిస్థితిలోకి వెళ్లాడు. దీంతో ఆయన్ని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. దాదాపు వారం రోజుల పాటు ఈ చికిత్స జరిగింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో బయటకు వచ్చింది.

ఆ ఫొటోలో రవీందర్‌ ముక్కుకు ఆక్సిజన్‌ మాస్కుతో ఉన్నాడు. ఆ ఫొటో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. రవీందర్‌ తన దగ్గరినుంచి 16 కోట్లు తీసుకుని చీటింగ్‌ చేశాడంటూ చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనతో బిజినెస్‌ ఒప్పందం చేసుకుని మోసం చేశాడని బాలాజీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో రవీందర్‌ మోసానికి పాల్పడినట్లు తేలింది. దీంతో ఆయన్ని తాజాగా అరెస్ట్‌ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి