iDreamPost

భారీ వర్షాలు.. స్కూల్స్ కు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!

గత రెండు మూడు రోజుల నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షం కురువడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీని కారణంగానే స్కూల్స్ కు సెలవులు ప్రకటించింది.

గత రెండు మూడు రోజుల నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షం కురువడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీని కారణంగానే స్కూల్స్ కు సెలవులు ప్రకటించింది.

భారీ వర్షాలు.. స్కూల్స్ కు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!

గత కొన్ని రోజుల నుంచి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వానలు దంచికోడుతున్న విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అయితే ఉన్నట్టుండి వాతవరణం ఒక్కసారిగా మార్పులు సంభవించాయి. దీని కారణంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో రైతులు ఆందోళనలో పడ్డారు. స్కూల్స్ కు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇక బుధవారం కూడా తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి. వరుసగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ఈ క్రమంలోనే రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

అంటే.. బుధవారం, గురువారం వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఇక ముందస్తు చర్యల్లో భాగంగానే తమిళనాడులోని పాఠశాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. వర్షం కారణంగా బుధ, గురువారం స్కూల్స్ కు రెండు రోజుల పాటు హాలీడేను ప్రకటించింది విద్యాశాఖ. ఇక రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం వారికి సూచించింది. అయితే, ఈ క్రమంలోనే గురువారం హైదరాబాద్ లో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్ తదిర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కాగా, సరిగ్గా స్కూల్స్ కు, ఆఫీసుకు వెళ్లే సమయానికే వర్షం కురువడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి