SNP
SNP
భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఘోర అవమానం జరిగింది. అది కూడా అతనంటే పిచ్చి అభిమానం చూపించే రాష్ట్రంలోనే. ఇప్పటికే ఆ రాష్టం ఏదో మీకే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఐపీఎల్‌లో 16 ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్‌ను ముందుండి నడిపిస్తున్న ధోని అంటే తమిళ ప్రజలకు అభిమాన క్రికెటర్. అతని పేరు వింటే వారంతా తన్మయత్వంతో ఊగిపోతారు. ధోనిని ముద్దుగా తలా అని కూడా పిలుచుకుంటారు. ధోనిని అంతలా ఆరాధిస్తారు తమిళ ప్రజలు. కానీ, ఇప్పుడు ధోనికి అవమానం జరిగింది కూడా తమిళనాడులోనే. వినేందుకు వింతగా ఉన్నా.. ఇదే నిజం. అసలు విషయం ఏంటంటే..?
తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టీఎన్‌సీఏ) గతంలో రంజీ ట్రోఫీకి ముందు దానికి ప్రీటోర్నీకిగా దీన్ని నిర్వహిస్తూ ఉండేది. కానీ, ఓ ఐదేళ్లుగా ఆ టోర్నీని నిలిపివేసింది. అయితే.. గతేడాది జరిగిన రంజీ ట్రోఫీలో తమిళనాడు జట్టు దారుణంగా విఫలమవడంతో టీఎన్‌సీఏ మళ్లీ బుచ్చిబాబు టోర్నీని తెరమీదకు తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 12 జట్లు ఈ టోర్నీలో పాల్గొననుండగా.. నాలుగు రోజుల ఫార్మాట్‌లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. టీఎన్‌సీఏ ప్రెసిడెంట్ ఎలెవన్‌తో పాటు ఇండియన్ ర్వైల్వేస్, త్రిపుర, హర్యానా, బరోడా, మధ్యప్రదేశ్, ముంబై, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, టీఎన్‌సీఏ ఎలెవన్, కేరళ, బెంగాల్ జట్లు పోటీలో పాల్గొంటాయి. ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 18వరకు సెలెమ్, కొయంబత్తూరు, దిండిగల్, తిరునెల్వెలి నగరాల్లో ఈ టోర్నీకి సంబంధించిన మ్యాచ్‌లు జరగనున్నాయి.
మొత్తం 12 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించి టోర్నీ నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. అయితే ఈ టోర్నీలో జార్ఖండ్ టీమ్‌ను కూడా భాగం చేయాలని మహేంద్ర సింగ్ ధోనీ టీఎన్‌సీఏకు ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. ధోని అంతటోడు అడిగాడు కాబట్టి టీఎన్‌సీఏ జార్ఖండ్ టీమ్‌ను కూడా టోర్నీలో భాగంగా చేస్తుందని అంతా భావించారు. కానీ, ధోని రిక్వెస్ట్‌ను ఏ మాత్రం లెక్కచేయకుండా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ జార్ఖండ్ టీమ్‌ను బుచ్చిబాబు టోర్నీలో ఆడేందుకు అనుమతించలేదు. దీంతో ధోని అడిగినా టీఎన్‌సీఏ పట్టించుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది ధోనికి జరిగిన అవమానంగా క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Tamil Nadu Cricket Association declines MS Dhoni request to include Jharkhand in Buchi Babu Tournament. #CricketTwitter pic.twitter.com/51RjdMEzwN
— Himanshu Pareek (@Sports_Himanshu) August 11, 2023
ఇదీ చదవండి: ఆ ముగ్గురు లేకుంటే టీమిండియా బంగ్లాదేశ్ కంటే బలహీనం: పాక్ మాజీ కెప్టెన్