అసలు సినిమా అంటే ఒక ఫార్ములా ప్రకారమే నడవాలా. కొత్తగా ఆలోచిస్తే జనం ఆదరించరా. అవుట్ అఫ్ ది బాక్స్ థింకింగ్(పరిధిని మించి ఆలోచించడం)ని దర్శకులు అందిపుచ్చుకోలేరా. వీటికి సమాధానం మాటల రూపంలో కంటే ఒక మూవీగా చెప్పాల్సి వస్తే ఐతే కన్నా గొప్ప ఉదాహరణ మరొకటి అక్కర్లేదు. స్క్రీన్ ప్లేతో మేజిక్ చేసే అరుదైన టెక్నీషియన్ గా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మొదటి చిత్రం ఇది. ఆ విశేషాలు చూద్దాం. […]