ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవంటారు. రాకీయాల్లో తరచూ ఈ పదం వినిపిస్తుంటుంది. అయితే కాలం అన్నింటినీ మార్చేస్తుంటుంది. సాధ్యం కాదనుకున్నది సుసాధ్యం చేస్తుటుంది. ఒక ఒరలో రెండు కత్తులు కాదు.. మూడు, నాలుగు, ఐదు కత్తులు ఒదిగిపోయిన సందర్భాలు ప్రస్తుత రాజకీయాల్లో చూస్తున్నాం. కారణాలేమైనా 1994 నుంచి 2019 వరకు ఆరు ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున పోటీ చేసిన నేతలందరూ ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. రాజకీయాల్లో అరుదుగా సంభవించే ఈ పరిణామానికి ప్రకాశం […]
దాదాపు పది నెలలుగా సాగుతున్న సస్పెన్స్‌కు టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తెర దించారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. మూడు రాజధానులకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో శాసన మండలిలో జరిగిన ఓటింగ్‌లో టీడీపీ విప్‌ను ధిక్కరించిన పోతుల సునీత వైసీపీకి ఓటు వేశారు. సునీతతోపాటు మరో టీడీపీ ఎమ్మెల్సీ చదిపిరాళ్ల శివానాథ్ రెడ్డి కూడా విప్ ధిక్కరించారు. దాంతో వారిద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ టీడీపీ శాసన మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ […]
ఊహించినదే నిజమైంది. వైసీపీలో చేరుతున్నానని ప్రకటించిన టీడీపీ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అనధికారికంగానే పార్టీలో చేరారు. కొద్దిసేపటి క్రితం తన కుమారుడు కరణం వెంకటేష్‌తో కలసి కరణం బలరాం సీఎం జగన్‌ను కలిశారు. సీఎం జగన్‌కు ఎమ్మెల్యే కరణం పుష్పగుచ్ఛం అందించారు. వెంకటేష్‌కు జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కరణం వెంకటేష్, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలు మీడియా ముందుకొచ్చారు. Read Also : కరణం బలరాం వైఎస్సార్‌సీపీలో అధికారికంగా చేరుతారా..? జగనన్నపాలన మెచ్చి పార్టీలో […]
వైఎస్సార్‌సీపీకి బలమైన జిల్లాగా పేరుగాంచిన ప్రకాశం జిల్లాలో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాస రెడ్డి 27వేల భారీ మెజార్టీతో గెలిచారు. నెల్లూరు లోక్‌సభలో భాగమైన కందుకూరులోనూ లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డికి దాదాపు 30 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ప్రకాశంలో 2014 ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని భావించిన వైఎస్సార్‌సీపీకి చుక్కెదురైంది. మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 12 సీట్లకు గాను వైఎస్సార్‌సీపీ […]
టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ రోజు సాయంత్రం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఆమె కలిశారు. ఆమెకు పార్టీ కండువా కప్పిన వైఎస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోతుల సునీత మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు బాగున్నాయి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ఉన్నాయి. అందుకే మూడు రాజధానులపై అనుకూలంగా ఓటు వేశాను.. అని చెప్పుకొచ్చారు. ప్రజా ప్రతినిధులు ఎవరైనా సరే రాజీనామా చేసిన తర్వాత మాత్రమే పార్టీలోకి తీసుకుంటామని […]
రాష్ట్ర అసెంబ్లీలో రాజాధాని మార్పునకు ఉద్దేశించిన “ఆంధ్రపరదేశ్ పరిపాలనా వికేంధ్రీకరణ, సమతుల అభివృద్ధి బిల్లు” ని సోమవారం ఆమోదించడం, వెంటనే దానిని శాసనమండలి ఆమోదానికి పంపడం చక చకా జరిగిపోయింది. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, అసెంబ్లీలో వైసిపికి మంచి మెజారిటీ ఉండడంతో బిల్లు ఆమోదానికి ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదు. అయితే ఆ బిల్లుని శాసన మండలి ఆమోదానికి పంపడంతో, స్వతహాగా ఆ బిల్లుని వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీకి శాసన మండలిలో ఆధిక్యత ఉండడంతో […]
పరిటాల కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రులుగా , తెలుగుదేశానికి బలమైన మద్దతుదారులగా ఉన్న పోతుల సురేష్ కుటుంబం టీడీపీకి షాక్ ఇవ్వబోతోంది. సురేష్ భార్య టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ముఖ్యమంత్రి జగన్ ను కలవనున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. శాసన మండలిలో తెలుగుదేశం ప్రవేశ పెట్టిన రూల్ 71 కి విప్ ధిక్కరించి వ్యతిరేకంగా ఓటు వేసి సొంత పార్టీకే షాక్ ఇచ్చిన పోతుల సునీత , తాజాగా ముఖ్యమంత్రిని కలవబోతున్నారనే వార్తతో […]
శాసనమండలితో సంబంధం లేని వ్యక్తులు గ్యాలీరీల్లో కూర్చుని ఎమ్మెల్సీను బెదరిస్తున్నారని టీడీపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి లపై ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి మండలి గ్యాలరీలో కూర్చుని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాశారు. మూడు రాజధానుల బిల్లుపై మండలిలో గందరగోళం సంగతి తెలిసిందే. మంగళవారం మండలిలో […]
ఆంద్రప్రదేశ్ శాశన మండలిలో తెలుగుదేశానికి షాక్ తగిలింది. ఈ రోజు ఉదయం మండలి ప్రారంభం అవ్వకముందే తెలుగుదేశం మండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ తన పదవికి రాజీనామ చేశారు, మరొక సభ్యురాలు శమంతకమణి సభకు హాజారు కాలేదు. ఇది ఇలా ఉంటే సాయంత్రానికి తెలుగుదేశానికి మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఊహించని షాక్ ఇచ్చారు. ఏపి శాసన మండలిలో రూల్ నెంబర్ 71పై ఛైర్మెన్ ఎం.ఏ షరీఫ్ ఓటింగ్ పెట్టగా అనుకూలంగా 27, వ్యతిరేకంగా 11 మంది […]