iDreamPost

మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం! శ్రీలంక పోలీసుల అదుపులో ఇద్దరు ఇండియన్స్..

మ్యాచ్ ఫిక్సింగ్.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఇప్పటికై ఐపీఎల్ లాంటి మెగాటోర్నీపై కూడా ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన విషయం తెలిందే. తాజాగా ఫిక్సింగ్ ఆరోపణలతో ఇద్దరు ఇండియన్స్ పాస్ పోర్ట్ లను సీజ్ చేశారు శ్రీలంకన్ పోలీసులు. ఆ వివరాల్లోకి వెళితే..

మ్యాచ్ ఫిక్సింగ్.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఇప్పటికై ఐపీఎల్ లాంటి మెగాటోర్నీపై కూడా ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన విషయం తెలిందే. తాజాగా ఫిక్సింగ్ ఆరోపణలతో ఇద్దరు ఇండియన్స్ పాస్ పోర్ట్ లను సీజ్ చేశారు శ్రీలంకన్ పోలీసులు. ఆ వివరాల్లోకి వెళితే..

మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం! శ్రీలంక పోలీసుల అదుపులో ఇద్దరు ఇండియన్స్..

ప్రపంచ క్రికెట్ ను ఫిక్సింగ్ షేక్ చేస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ లోని అన్ని ఐపీఎల్ మ్యాచ్ లు టాస్ విషయంలో ముందే ఫిక్సింగ్ అవుతున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. టాస్ ఏ టీమ్ గెలవాలి? అన్నది ముందుగానే డిసైడ్ అవుతున్నాయన్నది వారి వాదన. దాంతో ఇప్పటికే క్రికెట్ లవర్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలోనే మరో ఫిక్సింగ్ వార్త వరల్డ్ క్రికెట్ లో చర్చనీయాంశంగా మారింది. ఓ ఇద్దరు ఇండియన్స్ ఫిక్సింగ్ చేశారన్న ఆరోపణలు రావడంతో.. వారి పాస్ పోర్ట్ ను సీజ్ చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

మ్యాచ్ ఫిక్సింగ్స్ ఆరోపణలతో ఇద్దరు ఇండియన్స్ ను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  లెజెండ్స్ క్రికెట్ లీగ్ 2024లో అనధికార మ్యాచ్ లను ఫిక్సింగ్ చేసేందుకు యోని పటేల్, పి. ఆకాశ్ అనే ఇద్దరు ఇండియన్స్ ప్రయత్నించారని శ్రీలంక పోలీసులు గుర్తించారు. లెజెండ్స్ లీగ్ లో భాగంగా మార్చి 8, 19 తేదీల్లో పల్లెకలే వేదికగా జరిగిన మ్యాచ్ లను ఫిక్సింగ్ చేయడానికి వీరిద్దరు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో వారిని అరెస్ట్ చేశారు. కానీ వారు బెయిల్ పై విడుదల అయ్యారు. అయితే.. కేసు విచారణ పూర్తి అయ్యేవరకు దేశం వదిలి వెళ్లడానికి వీల్లేదని, వారి పాస్ పోర్ట్ లను సీజన్ చేయాలని శ్రీలంక కోర్ట్ ఆదేశించింది.

ఇదిలా ఉండగా.. లెజెండ్స్ లీగ్ 2024 ఫైనల్లో న్యూయార్క్ సూపర్ స్ట్రైకర్స్ ను ఓడించి.. ఛాంపియన్స్ గా నిలిచింది రాజస్తాన్ కింగ్స్. కాగా.. ఈ లీగ్ లో పాల్గొన్న కాండీ కాంప్ ఆర్మీ టీమ్ కు ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న యోని పటేల్ ఓనర్ కావడం గమనార్హం. వీరిద్దరు ఫిక్సింగ్ కు పాల్పడ్డారని న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ నీల్ బ్రూమ్, శ్రీలంక చీఫ్ సెలెక్టర్ ఉపుల్ తరంగాతో పాటుగా క్రీడా మంత్రిత్వ శాఖ స్పెషల్ ఇన్విస్టేగేషన్ కు యూనిట్ కు ఫిర్యాదు చేశారు. దాంతో విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకుంది. మరి క్రికెట్ ప్రపంచానికి పెను విపత్తుగా మారిన ఫిక్సింగ్ భూతంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి