Dharani
Eesha Rebba: ఈషా రెబ్బా చిన్న సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఐడ్రీమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షూటింగ్ సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులు, పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పుకొచ్చింది. ఆ వివరాలు.
Eesha Rebba: ఈషా రెబ్బా చిన్న సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఐడ్రీమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షూటింగ్ సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులు, పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పుకొచ్చింది. ఆ వివరాలు.
Dharani
రుతస్రావం, పీరియడ్స్.. ఎలా పిల్చుకున్న ప్రతి ఆడపిల్ల జీవితంలో ఇది చాలా ముఖ్యమైన భాగం. 10-12 వ ఏట ప్రారంభం అయ్యే.. ఈ ప్రక్రియ ఏళ్ల తరబడి కొనసాగుతుంది. ఇది చాలా సహజమైన ప్రక్రియ.. కానీ మన సమాజంలో నేటికి కూడా దీని గురించి బహిరంగంగా మాట్లాడరు. ఇప్పటికి కూడా చాలా మంది అబ్బాయిల పీరియడ్స్, ఆ సమయంలో వాడే వస్తువుల గురించి రకరకాల కామెంట్స్ చేస్తారు. కానీ ఓ ఆడపిల్ల.. మహిళగా మారి.. తల్లిగా మనకు జన్మనిచ్చేలా తన తనువును మార్చేది ఈ రుతస్రావ ప్రక్రియే. సమాజంలో ప్రతి ఆడపిల్ల, మహిళ దీన్ని ఎదుర్కొంటుంది.
ఇక పీరియడ్స్ సమయంలో అందరికి ఒకేలా ఉండదు. కొందరికి బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది.. కొందరికి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. ఇక కొందరి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. వాంతులు, విపరీతమైన నొప్పి వంటి సమస్యలతో బాధపడతారు. ఇక ప్రతి నెల ఉండే సమస్యలే కాబట్టి చాలా మంది ఆడపిల్లు, మహిళలు ఈ బాధలను అలానే భరిస్తారు. ఇక సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు.. రెస్ట్ తీసుకుంటారు. ఉద్యోగాలకు, కాలేజీలకు వెళ్లే వారు సెలవు పెట్టుకుంటారు. మరి సినిమాల్లో పని చేసే వారి పరిస్థితి ఎలా ఉంటుంది. ఎందుకంటే సినిమా షూటింగ్ అంటే.. కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దాంతో పీరియడ్స్ సమయంలో సామాన్యులకు ఉన్నంత ఫ్రీడం, రెస్ట్ తీసుకునే అవకాశం సినీ తారలకు ఉండదు. తాజాగా దీనిపై స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరోయిన్ ఈషా రెబ్బా.
‘‘పీరియడ్స్ సమయంలో సెలవు తీసుకోవడం మాకు సాధ్యం కాదు. ఎందుకంటే అదే రోజు కాంబినేషన్ సీన్లు, టిపికల్ సీన్లు ఉండొచ్చు. దాంతో మేం సెలవు తీసుకునే అవకాశం ఉండదు. కాకపోతే.. డైరెక్టర్‌కి చెబితే కాసేపు రెస్ట్ తీసుకునే అవకాశం ఇస్తారు. అంతే తప్ప.. మనకు రోజంతా సెలవు ఇవ్వరు. అయితే ప్రారంభంలో పీరియడ్స్ వేళ నేను చాలా ఇబ్బంది పడ్డాను. దీని గురించి ఎవరితో మాట్లాడాలో.. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ డైరెక్టరే అర్థం చేసుకుని.. మీరు బాగానే ఉన్నారా.. అని అనేక సార్లు ప్రశ్నించారు. అప్పటి నుంచి నా ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఆ తర్వాత నుంచి పీరియడ్స్ సమయంలో నేను పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాను. మరీ ఇబ్బందిగా ఉంటే.. డైరెక్టర్‌కి చెబుతాను. నేను పీరియడ్స్‌లో ఉన్నాను అని. కొందరు అర్థం చేసుకుని.. మనకు కాస్త సమయం ఇస్తారు. కానీ కొందరితో పని చేసే సమయంలో మనం వాళ్లతో ఇలా మాట్లాడలేము కూడా’’ అని చెప్పుకొచ్చింది ఈషా రెబ్బా.
ఇక ఈషా రెబ్బా విషయానికి వస్తే.. సుమారు 12 ఏళ్ల క్రితం అనగా 2012లో చిన్న సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని పెద్ద సినిమాల్లో విభిన్నమైన కార్యక్టర్స్ చేసింది. అలానే వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది ఈషా రెబ్బా.