iDreamPost

ఆ నియోజకవర్గంలో గత పాతికేళ్లుగా గెలిచినోళ్లు,ఓడినోళ్లు అందరూ ఒకే గూటికి చేరారు..!

ఆ నియోజకవర్గంలో గత పాతికేళ్లుగా గెలిచినోళ్లు,ఓడినోళ్లు అందరూ  ఒకే గూటికి చేరారు..!

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవంటారు. రాకీయాల్లో తరచూ ఈ పదం వినిపిస్తుంటుంది. అయితే కాలం అన్నింటినీ మార్చేస్తుంటుంది. సాధ్యం కాదనుకున్నది సుసాధ్యం చేస్తుటుంది. ఒక ఒరలో రెండు కత్తులు కాదు.. మూడు, నాలుగు, ఐదు కత్తులు ఒదిగిపోయిన సందర్భాలు ప్రస్తుత రాజకీయాల్లో చూస్తున్నాం. కారణాలేమైనా 1994 నుంచి 2019 వరకు ఆరు ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున పోటీ చేసిన నేతలందరూ ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. రాజకీయాల్లో అరుదుగా సంభవించే ఈ పరిణామానికి ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం వేదికైంది.

1994 – 2019 చీరాల నుంచి పలువురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మంత్రులయ్యారు. ఓడిపోయిన వారూ ఉన్నారు. వారందరూ ఇప్పుడు రాజకీయంగా చురుగానే ఉన్నారు. కానీ వారందరూ ఒకే పార్టీలో ఉండడమే విశేషం. మాజీ మంత్రి పాలేటి రామారావు, జంజనం శ్రీనివాసరావు, ఆమంచి కృష్ణమోహన్, పోతుల సునీత, కరణం బలరామకృష్ణమూర్తిలు వైసీపీలో ఉన్నారు.

Also Read:ఇదీ.. విశాఖ ‘విశ్వ’రూపం

1994లో పాలేటి రామారావు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లోనూ గెలిచి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి కూడా అయ్యారు. 2004లో పోటీ చేసి ఓడిపోయారు. 2009లో పాలేటికి టీడీపీ టిక్కెట్‌ దక్కలేదు. పీఆర్‌పీ టిక్కెట్‌ దక్కించుకున్న పాలేటి త్రిముఖపోరులో నిలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున జంజనం శ్రీనివాసరావు బరిలో నిలుచున్నారు.

2009లో టీడీపీ తరఫున చీరాలో పోటీ చేసిన జంజనం శ్రీనివాసరావు గడచిన మున్సిపల్‌ ఎన్నికల్లో చీరాల మున్సిపాలిటీలో వైసీపీ తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొందారు. మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. జంజనం శ్రీనివాసరావు కరణం బలరాం వర్గంలో ఉన్నారు.

Also Read:ఏడాదికొకరికి చైర్మన్‌ పదవి.. జేసీ ప్రభాకర్‌ రెడ్డి మాటపై నిలబడతారా..?

2009లో కాంగ్రెస్‌ నుంచి, 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఆమంచి కృష్ణమోహన్‌ 2019లో వైసీపీ తరఫున బరిలో నిలుచుకున్నారు. టీడీపీ అభ్యర్థి కరణం చేతిలో ఓడిపోయారు.

2014లో టీడీపీ తరఫున పోటీ చేసిన పోతుల సునీత స్వతంత్ర అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆమెకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. 2019 ఎన్నికల్లో చీరాల టిక్కెట్‌ దక్కకపోడంతో అసంతృప్తితో ఉన్న పోతుల సునీత.. ఎన్నికల తర్వాత వైసీపీ గూటికి చేరారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తిరిగి వైసీపీ తరఫున ఎన్నికయ్యారు.

Also Read:మహిళలకు పట్టం.. జగన్ ప్రభుత్వం మరో సంచలనం

గడచిన సార్వత్రి ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన కరణం ఆ తర్వాత తనయుడు వెంకటేష్‌తో కలసి వైసీపీ గూటికి చేరారు. కాంగ్రెస్‌ నుంచి రాజకీయ జీవితం మొదలు పెట్టిన కరణం.. ఆ తర్వాత టీడీపీలో ప్రయాణం సాగించారు. ప్రకాశం జిల్లాలో సీనియర్‌నాయకుడుగా పేరొందారు. పలుమార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యం, తనయుడు భవిష్యత్‌ కోసం వైసీపీ గూటికి చేరారు.

2014లో వైసీపీ తరఫున పోటీ చేసిన యడం బాలాజీ 2019లో టిక్కెట్‌ దక్కకపోవడంతో టీడీపీలో చేరారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత తర్వాత బలరాం టీడీపీకి దూరమయ్యారు,వైసీపీకి సన్నిహితంగా ఉన్నారు.దీనితో టీడీపీ భారం యడం బాలాజి మీద పడింది.

Also Read : చీరాలలో గెలిచిందెవరు..?

ఆ విధంగా 1994 నుంచి ప్రధాన పార్టీల తరుపున గెలిచిన వారు,ఓడిన వారిలో ఒక్క రోశయ్య తప్ప మిగిలిన ముఖ్యనేతలందరు వైసీపీలో ఉండటం యాదృచ్చికం కాదు ,చీరాల రాజకీయ పరిస్థితిని సూచిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి