బీజేపీ.. జాతీయ పార్టీ. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. కానీ విధానాలు మాత్రం దేశమంతటా ఒకేలా ఉండవు. ఒక్కోచోట ఒక్కోలా పార్టీ తీరు ఉంటుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని అంటారు.. కానీ పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇస్తారు. రోహింగ్యాలను తరిమికొడతామని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అంటారు.. వలస వచ్చిన వారిని అక్కున చేర్చుకుంటామని బెంగాల్ ప్రచారంలో అమిత్ షా అంటారు. తిరుపతిలో వైసీపీ ఎంపీ, నాగార్జున సాగర్ […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పాలక వర్గం కొలువుతీరేందుకు సిద్ధమైంది. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ హాలులో సమావేశమయ్యారు. మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఈ కార్యక్రమం గంటన్నరలో ముగియనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించడంతో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల క్రితం పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన బీజేపీ.. కొద్దిసేపటి క్రితం తమ […]
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడి నెల దాటింది. ఆ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులందరూ కోట్లాది రూపాయలు కుమ్మరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కొందరు సుమారు 2 కోట్ల నుంచి పది కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టిన వారు ఉన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి 7 కోట్ల వరకూ ఖర్చు పెట్టాడట. తీరా అతను ఓడిపోయాడు. దీంతో ఆదుకోవాలని, పార్టీ ఫండ్ ఎంతో కొంత ఇప్పించాలని కోరుతూ అధిష్ఠానం చుట్టూ తిరుగుతున్నాడు. […]
గ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 4 నుంచి 48 స్థానాలకు పుంజుకున్న విషయం తెలిసిందే. మజ్లిస్‌కు పెట్టని కోట అయిన ఓల్డ్ సిటీలోకి కూడా బీజేపీ బలం భారీగా పెరిగింది. బీజేపీ పాతబస్తీలో ఎంఐఎంను పెద్దగా ఢీకొట్టలేకపోయినా టీఆర్‌ఎస్‌ను మాత్రం వెనక్కి నెట్టేసింది. గతం కంటే అత్యధిక సంఖ్యలో ఓట్లను పెంచుకుంది. అంతేకాదు.. 2016లో ఆ ప్రాంతంలో టీఆర్‌ఎస్ సాధించిన 9 స్థానాలను కూడా బీజేపీయే సాధించింది. 2020 ఎన్నికలు జరగక ముందు వరకూ పాతబస్తీలో […]
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి నిరాశనే మిగిల్చాయి. సెంచరీ కొట్టాలని తహతహలాడిని గులాబి దళానికి చేదు అనుభవం ఎదురైంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుచుకున్న నలబైకి పైగా స్థానాల్లో బీజేపీ పాగా వేసింది. దీంతో మెజార్టీ స్థానాలను సాధించుకున్నప్పటికీ మేయర్ పీఠానికి చేరువకాలేక పోయింది టీఆర్ఎస్. ఈ అనూహ్య ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న అధికార పార్టీకి కాస్త ఊరట లభించింది. నేరెడ్ మెట్ డివిజన్ లో టీఆర్ఎస్ విజయాన్ని సొంతం చేసుకుంది. చివరి డివిజన్ ను తన […]
బావా.. బావా.. హైదరాబాదు నుంచి మొత్తం లగేజీ సర్దేయొచ్చుమో… అంటూ అరుచుకుంటూ లోపలికొచ్చాడు మణి మాంచి నిద్రమత్తులో నుంచి ఉలిక్కిపడి లేచాడు కిట్టయ్య. కళ్ళు నులుముకుంటూ ఒరే మణీ.. నీకు వేళాపాళా లేదురా. ప్రశాంతంగా నిద్ర పడుతోంది. ఇప్పుడొచ్చి లేపేసావ్.. అంటూ విసుక్కున్నాడు. ఇంకా నిద్రంటావేంటి బావా.. అక్కడ హైదరాబాదులో అంతా ఖాళీ అయిపోతేను అన్నాడు ఇంకా అదే అరుపును కంటిన్యూ చేస్తూ మణి. ఏం ఖాళీ అయిపోయిందిరా.. అన్నాడు ఒక్కసారిగా నిద్రమత్తులో నుంచి బైటకు వస్తూ […]
తెలంగాణాలో టీఆర్‌ఎస్‌కు ఎదురేలేదు. మొన్న దుబ్బాక ఉప ఎన్నిక వరకు రాజకీయవర్గాల్లో విస్తృతంగా నలిగిందీ మాట. అయితే దుబ్బాక ఫలితం చూసాక ఎక్కడో తేడా కొడుతోందే.. అనుకున్నారు. ఇప్పుడు జీహెచ్‌యంసీ ఎన్నికల ఫలితాలతో టీఆర్‌ఎస్‌కు కూడా పోటీ సిద్ధమైందన్న అభిప్రాయానికొచ్చేసారు. మేయర్ పీఠంపై ఎవరైనా కూర్చోనీ.. కానీ నాలుగు సీట్ల నుంచి ఇప్పుడు 48 సీట్లకు బీజేపీ బలం పెరగడం ఖచ్చితంగా టీఆర్‌ఎస్ నాయకులను కలవరపెట్టే విషయమేనంటున్నారు పరిశీలకులు. ఇకపై ఏకపక్ష నిర్ణయాలు కుదరకపోవచ్చునన్న సందేహాలను కూడా […]
ఎక్స్ అఫీషియో ఓట్లు కలుపుకున్నా గ్రేటర్‌లో టీఆర్‌ఎస్ అధికారం చేజిక్కుంచుకోలేని పరిస్థితి ఏర్పడింది. గ్రేటర్‌లో తమకు తిరుగులేదనుకుంటున్న తరుణంలో ఎందుకిలా జరిగింది..? కారణాలేంటి..? భవిష్యత్‌లో మరింత బలపడాలంటే ఏం చేయాలి..? అన్న అంశాలపై టీఆర్‌ఎస్‌లో అంతర్మథనం జరుగుతోంది. 100 స్థానాల కంటే ఎక్కువ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్‌ఎస్ వర్గాలు 55 స్థానాలు పొందడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. దీంతో ఫలితాలను పున:సమీక్షించుకుంటామని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు ప్రకటించారు. ఇప్పటికే పార్టీలోని పలువురు […]
అంచనాలు తల్లకిందులయ్యాయి. కారు స్పీడు తగ్గింది. కమలం వికసించింది. ఎంఐఎం పట్టు నిలుపుకుంది.. వెరసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. 150 డివిజన్లకు గాను టీఆర్‌ఎస్ 56 డివిజన్లలో గెలుపొందింది. బీజేపీ 47 డివిజన్లలో విజయకేతనం ఎగురువేసింది,2 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది . ఎంఐఎం 43 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం దక్కింది. ఆ పార్టీ రెండు డివిజన్లలో గెలిచింది. గ్రేటర్ ఓటురు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. 150 […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల కౌంటింగ్‌లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు డివిజన్ల వారీగా వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకు వెల్లడైన పోస్టల్ బ్యాలెట్‌లలో బీజేపీ ముందంజలో ఉంది. ఇప్పటి వరకు వెల్లడైన పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో 92 డివిజన్‌లలో బీజేపీ, టీఆర్‌ఎస్ 33, ఎంఐఎం 15, కాంగ్రెస్ 4 డివిజన్లలో ఆధిక్యంలో నిలిచాయి. పాత బస్తీ డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యంలో నిలిచి అందరిలోనూ ఆసక్తిని రేపింది. ఇతర డివిజన్లలోనూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ […]