మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో మెగా హీరో అల్లు అర్జున్, పూజా హెగ్దే జంటగా నటించిన సినిమా అల వైకుంఠపురంలో.. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అంతేకాదు.. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్లకు పైగా వసూళ్లు రాగా.. అమెరికాలో మూడు మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి దుమ్ములేపింది. సినిమాలోని కంటెంట్ తో పాటుగా యూనిట్ కష్టపడి చేసిన పబ్లిసిటీకి […]
ఈ ఏడాది తొలి ఇండస్ట్రీ హిట్ గా రికార్డులు నమోదు చేసుకున్న అల వైకుంఠ పురములో డిజిటల్ టెలికాస్ట్ అర్ధరాత్రి నుంచి మొదలైపోయింది. మొన్న 26నే వస్తుందని ప్రకటించి వాయిదా వేయడం పట్ల నెటిజన్లు భగ్గుమన్నారు. ఈ సినిమా కోసమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్లకు ఇది మరింత ఆగ్రహం కలిగించింది. మరి దానికి తలొగ్గారో లేక సాంకేతిక సమస్య వల్ల ఆలస్యమయ్యిందో తెలియదు కానీ మొత్తానికి 27 నుంచి సన్ నెక్స్ట్ యాప్ లో అల వైకుంఠపురములో […]
సంక్రాంతి బరిలో విజేతగా నిలిచి నాన్ బాహుబలి రికార్డ్స్ బద్దలుకొట్టే దిశగా దూసుకెళుతున్న అల్లు అర్జున్-త్రివిక్రమ్ బంఫర్ హిట్ సినిమా అల వైకుంఠపురములో ఇప్పటికి మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు కూడా విడుదలైన ఆరు వారాలకే OTT లో వస్తుండటంతో చాలా మంది ప్రేక్షకులు కొద్దీ రోజులు ఆగి amozon prime /netflix/hotstar/sun nxt లో చూద్దాంలే అనుకోవటంతో సినిమా కలెక్షన్స్ మీద ప్రభావం చూపుతుంది. తమ సినిమా మీద ఈ ప్రభావం పడకుండా […]
సరిలేరు నీకెవ్వరుతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు అల వైకుంఠపురములోని డామినేట్ చేయాలని కోరుకున్నాడు కానీ అది సాధ్య పడకపోవడం అభిమానులకు కొంత అసంతృప్తినైతే మిగిల్చింది. సరే వరసగా మూడో వంద కోట్ల సినిమాతో హ్యాట్రిక్ అయితే దక్కిందిగా అనుకుంటూ సర్దుకున్నారు. ఇదిలా ఉండగా మహేష్ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే దాని మీద చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తోంది. మొన్నటిదాకా వంశీ పైడిపల్లి పేరు చాలా గట్టిగా వినపడింది. ఇద్దరూ కలిసి విదేశాలకు వెళ్లి అక్కడ కూడా […]
సంక్రాంతికి విడుదలై నాన్ బాహుబలి రికార్డులు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సన్ నెక్స్ట్ యాప్ లో ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతోందన్న వార్త ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. 50 రోజులకు అతి దగ్గరగా ఉన్న తరుణంలో ఇలా డిజిటల్ రూపంలో వదిలితే ఎలా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఒక రోజు ముందు రిలీజైన సరిలేరు నీకెవ్వరు రాకుండా తమ హీరో సినిమా స్ట్రీమింగ్ కావడం […]
అల వైకుంఠపురములో మిడిల్ క్లాస్ అబ్బాయిగా నటించినప్పటికీ ఆణువణువూ రిచ్ క్లాస్ ఫ్లేవర్ తడుతూ ఉంటుంది. అందుకే సుకుమార్ సినిమాలో లారీ డ్రైవర్ పాత్ర చాలా వినూత్నంగా ఉంటుందట. శేషాచలం అడవుల్లో షూటింగ్ కు అనుమతి దొరకని నేపథ్యంలో దానికి ప్రత్యాన్మాయం వెతికే పనిలో ఉన్నాడు సుకుమార్. ఎర్రచందనం దొంగతనం బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి కానీ దానికి […]
ఒకప్పుడు మురుగదాస్ అంటే బ్రాండ్. గజని సినిమా చూసి అమీర్ ఖాన్ అంతటి వాడే ఫ్లాట్ అయిపోయి రీమేక్ చేసే దాకా వదల్లేదు. చిరంజీవిని ఒప్పించడం మహామహా దర్శకులకే కష్టమైపోతున్న టైంలో స్టాలిన్ ఆఫర్ ఏరికోరి మరీ తనవద్దకు వచ్చేలా చేసుకున్న డైరెక్టర్ అతను. ఇక తెలుగులో వివి వినాయక్ టాగోర్ గా రీమేక్ చేసుకున్న తమిళ రమణ గురించి చెప్పుకుంటూ పోతే చాలా చరిత్రే ఉంది. విజయ్ కాంత్ సెకండ్ ఇన్నింగ్స్ కు ఇది హౌరా […]
టాలీవుడ్ స్టార్ హీరోల మార్కెట్ ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. మొన్నటి దాకా బాహుబలి లాంటి సినిమాలతోనే వంద కోట్ల మార్కు సాధ్యమనే లెక్కలను తారుమారు చేస్తూ రంగస్థలం, సాహో, అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు లాంటి మూవీస్ సైతం ఆ మార్కును అలవోకగా అందుకోవడంతో ఓవర్సీస్ లోనూ టాలీవుడ్ సత్తా చాటుతోంది. రెండేళ్ల క్రితం అజ్ఞాతవాసి లాంటి ఆల్ టైం డిజాస్టర్ తోనూ అరవై కోట్ల దాకా వసూళ్లు తెచ్చిన పవన్ కళ్యాణ్ మీదే ఇప్పుడు అందరి […]
టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఉండే ఇమేజ్ వయసుతో నిమిత్తం లేకుండా సాగుతుంది. ఎంత ఏజ్ బార్ అయినా కుర్ర హీరోయిన్ల పక్కన వీళ్ళను చూసేందుకు అభిమానులు ఎగబడుతూనే ఉంటారు. విషయానికి వస్తే టాలీవుడ్ లో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న పూజా హెగ్డేకు ఇటీవలే అల వైకుంఠపురములో రూపంలో ఇండస్ట్రీ హిట్ దక్కింది. గత ఏడాది మహర్షి అంతకు ముందు అరవింద సమేత వీర రాఘవ ఇలా ఎవరితో చేసినా అలా హిట్టు వచ్చి చేరిపోతోంది. […]
సంక్రాంతి సినిమాలు వచ్చి 20 రోజులు దాటేసింది. రేస్ లో గెలిచింది రెండే. అందులోనూ అల వైకుంఠపురములో ఫస్ట్ ప్లేస్ రాగా సరిలేరు నీకెవ్వరు రెండో స్థానంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఇక దర్బార్, ఎంత మంచివాడవురా టపా కట్టేశాయి. మాములుగా ఎంత పెద్ద హిట్ అయినా కొత్త సినిమాల హడావిడి రెండు మూడు వారాలు మాత్రమే ఉంటుంది. కానీ బన్నీ మహేష్ సినిమాలు నాలుగో వారంలోకి అడుగు పెడుతున్న సమయంలో కూడా ప్రేక్షకులకు వేరే ఆప్షన్ లేకపోవడం […]