iDreamPost

ఆ రుచి మరిగితే కోహ్లీ అస్సలు ఆగడు.. ఊతప్ప ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Jun 24, 2024 | 5:25 PMUpdated Jun 24, 2024 | 5:25 PM

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరైన సమయానికి ఫామ్​లోకి వచ్చాడు. పొట్టి కప్పు ఫస్ట్ ఫేజ్​లో పరుగులు రాక ఇబ్బంది పడిన కింగ్.. సూపర్-8లో తన రిథమ్​ను అందుకున్నాడు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరైన సమయానికి ఫామ్​లోకి వచ్చాడు. పొట్టి కప్పు ఫస్ట్ ఫేజ్​లో పరుగులు రాక ఇబ్బంది పడిన కింగ్.. సూపర్-8లో తన రిథమ్​ను అందుకున్నాడు.

  • Published Jun 24, 2024 | 5:25 PMUpdated Jun 24, 2024 | 5:25 PM
ఆ రుచి మరిగితే కోహ్లీ అస్సలు ఆగడు.. ఊతప్ప ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరైన సమయానికి ఫామ్​లోకి వచ్చాడు. పొట్టి కప్పు ఫస్ట్ ఫేజ్​లో పరుగులు రాక ఇబ్బంది పడిన కింగ్.. సూపర్-8లో తన రిథమ్​ను అందుకున్నాడు. గ్రూప్ దశ మ్యాచుల్లో 5 పరుగులు మాత్రమే చేసి అందర్నీ నిరాశకు గురిచేశాడు కింగ్. అయితే సూపర్ పోరులో మాత్రం తన టచ్​ను అందుకున్నాడు. మొదట ఆఫ్ఘానిస్థాన్ మీద 24 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో 28 బంతుల్లో 37 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ రెండు ఇన్నింగ్స్​ల్లో అతడు కొట్టిన పలు బౌండరీలు, సిక్సులు హైలైట్​గా నిలిచాయి. నిల్చున్న చోటు నుంచి అలవోకగా గ్రౌండ్ నలువైపులా భారీ షాట్లు ఆడుతూ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపించాడు. ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగే కీలక పోరులో తన సత్తా చాటేందుకు అతడు సిద్ధమవుతున్నాడు. వరల్డ్ కప్-2023 ఫైనల్​లో తమను ఓడించిన కంగారూల పని పట్టాలని చూస్తున్నాడు.

సాధారణంగా బిగ్ మ్యాచెస్​లో అదరగొట్టే కోహ్లీ.. అందునా ఆసీస్​తో మ్యాచ్ అంటే మరింత చెలరేగి ఆడతారు. అలాంటి కంగారూలపై ఇది రివేంజ్ టైమ్ కావడంతో కింగ్ ఎలా ఆడతాడోననేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పరుగుల రుచి మరిగితే కోహ్లీని ఆపడం ఎవరి వల్లా కాదన్నాడు. ఆసీస్​తో మ్యాచ్​లో అతడు హాఫ్ సెంచరీ బాదినా సరిపోతుందని ఊతప్ప అభిప్రాయపడ్డాడు. కోహ్లీ రాణిస్తే టీమ్ సునాయాసంగా సెమీస్​కు చేరుకుంటుందన్నాడు. ‘ఇవాళ్టి మ్యాచ్​లో కోహ్లీ బాగా ఆడాలి. అతడు 60 నుంచి 70 పరుగులు చేయాలని నేను కోరుకుంటున్నా. 120 నుంచి 125 స్ట్రైక్ రేట్​తో పరుగులు చేసినా చాలు. విరాట్ పరుగుల రుచి మరిగితే ఏదైనా సాధించగలడు’ అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.

సెమీఫైనల్​కు ముందు కోహ్లీ 150 స్ట్రైక్ రేట్​తో బ్యాటింగ్ చేస్తే చూడాలని ఉందన్నాడు ఊతప్ప. నాకౌట్ మ్యాచ్​కు ముందు విరాట్ మరింత ఊపందుకోవాలని తెలిపాడు. కింగ్ టాప్ ఫామ్​లోకి వస్తే భారత్​కు తిరుగుండదని పేర్కొన్నాడు. కోహ్లీ బ్యాటింగ్​తో పాటు మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ గురించి కూడా ఊతప్ప ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఓపెనర్​గా అగ్రెసివ్​గా బ్యాటింగ్ చేయడం మంచిదేనని.. హిట్​మ్యాన్​ అప్రోచ్​ను తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నాడు. రోహిత్ తన బ్యాటింగ్ విషయంలో పూర్తి క్లారిటీతో ఉన్నాడని.. అతడు అనుకున్న విధంగా ఆడాలని ఊతప్ప సూచించాడు. రోహిత్ తన న్యాచురల్ గేమ్​ ఆడుతూ పోవాలని, అదే టీమ్​కు మేలు చేస్తుందన్నాడు. తనదైన రోజున అతడు మ్యాచ్​ను సింగిల్ హ్యాండ్​తో వన్​సైడ్ చేసేస్తాడని వివరించాడు. మరి.. కోహ్లీ పరుగుల రుచి మరిగితే మంచిదంటూ ఊతప్ప చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి