iDreamPost
android-app
ios-app

ఆఫ్ఘాన్​తో మ్యాచ్​లో భుజానికి నల్ల రిబ్బన్లతో బరిలోకి భారత్.. ఎందుకిలా చేశారంటే?

  • Published Jun 20, 2024 | 8:40 PM Updated Updated Jun 20, 2024 | 8:40 PM

ఆఫ్ఘానిస్థాన్​తో జరుగుతున్న సూపర్-8 పోరులో భారత ఆటగాళ్లు భుజానికి నల్ల రిబ్బన్లు వేసుకొని బరిలోకి దిగారు. టీమిండియా ప్లేయర్లు ఎందుకిలా చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆఫ్ఘానిస్థాన్​తో జరుగుతున్న సూపర్-8 పోరులో భారత ఆటగాళ్లు భుజానికి నల్ల రిబ్బన్లు వేసుకొని బరిలోకి దిగారు. టీమిండియా ప్లేయర్లు ఎందుకిలా చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 20, 2024 | 8:40 PMUpdated Jun 20, 2024 | 8:40 PM
ఆఫ్ఘాన్​తో మ్యాచ్​లో భుజానికి నల్ల రిబ్బన్లతో బరిలోకి భారత్.. ఎందుకిలా చేశారంటే?

టీమిండియా సూపర్-8 జర్నీ స్టార్ట్ అయింది. ఆఫ్ఘానిస్థాన్​-భారత్ మధ్య సూపర్ పోరు మొదలైంది. టాస్ నెగ్గిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్​లో మెన్ ఇన్ బ్లూ మొత్తం భుజానికి నల్ల రంగు రిబ్బన్లు వేసుకొని బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. భారత ఆటగాళ్లు ఎందుకు బ్లాక్ ఆర్మ్​బ్యాండ్స్ వేసుకొని ఆడుతున్నారనేది తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్​కు గౌరవార్థకంగా రోహిత్ సేన ఇవాళ నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు.

టీమిండియా మాజీ పేసర్, కర్ణాటక రంజీ ప్లేయర్ డేవిడ్ జాన్సన్ (52) ఇవాళ సూసైడ్ చేసుకున్నాడు. బెంగళూరులోని తన ఫ్యామిలీ ఉంటున్న అపార్ట్​మెంట్ బాల్కనీ నుంచి పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంత ఎత్తు నుంచి కింద పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొన్నాళ్లుగా అతడు డిప్రెషన్​తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 1996లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్​లో డేవిడ్ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. భీకర పేస్​తో బౌలింగ్ చేసినప్పటికీ కంట్రోల్ లేకపోవడంతో అతడి కెరీర్ రెండు మ్యాచులకే పరిమితమైంది. అందులో అతడు 3 వికెట్లు పడగొట్టాడు. అయితే ఫస్ట్​క్లాస్​ క్రికెట్​లో మాత్రం 29 మ్యాచుల్లో 125 వికెట్లు తీశాడు జాన్సన్. అలాగే ఓ సెంచరీ కూడా బాదాడు. భారత క్రికెట్​కు అతడు అందించిన సేవలకు గౌరవ సూచకంగా, అతడి మృతికి నివాళిగా ఇవాళ టీమిండియా ప్లేయర్లు బ్లాక్ బ్యాండ్స్ ధరించి గ్రౌండ్​లోకి దిగారు.