iDreamPost

భారత్-బంగ్లా మధ్య సూపర్ పోరు.. మ్యాచ్​పై ప్రధాని మోడీ కామెంట్స్!

  • Published Jun 22, 2024 | 4:23 PMUpdated Jun 22, 2024 | 4:23 PM

భారత్-బంగ్లా మధ్య ఇంట్రెస్టింగ్​ ఫైట్​కు సర్వం సిద్ధమైంది. పొట్టి కప్పులో భాగంగా ఇవాళ జరిగే సూపర్ పోరులో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్​పై ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భారత్-బంగ్లా మధ్య ఇంట్రెస్టింగ్​ ఫైట్​కు సర్వం సిద్ధమైంది. పొట్టి కప్పులో భాగంగా ఇవాళ జరిగే సూపర్ పోరులో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్​పై ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • Published Jun 22, 2024 | 4:23 PMUpdated Jun 22, 2024 | 4:23 PM
భారత్-బంగ్లా మధ్య సూపర్ పోరు.. మ్యాచ్​పై ప్రధాని మోడీ కామెంట్స్!

టీ20 వరల్డ్ కప్-2024లో ఎదురే లేకుండా దూసుకెళ్తున్న టీమిండియా మరో ఇంట్రెస్టింగ్​ ఫైట్​కు సిద్ధమైంది. గ్రూప్ దశలో ఓటమి అనేదే లేకుండా హవా నడిపించిన రోహిత్ సేన.. సూపర్-8 స్టేజ్​ను కూడా అంతే బాగా స్టార్ట్ చేసింది. ఆఫ్ఘానిస్థాన్​తో మ్యాచ్​లో 47 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు బంగ్లాదేశ్​ను ఢీకొట్టేందుకు రెడీ అవుతోంది. ఈ రెండు టీమ్స్ మధ్య కరీబియన్ దీవుల్లోని ఆంటిగ్వాలో సూపర్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్​లో గెలిస్తే భారత్​కు సెమీస్ బెర్త్ ఖాయం అవుతుంది. అందుకే బంగ్లాను చిత్తు చేయాలని భావిస్తోంది మెన్ ఇన్ బ్లూ. ఓడితే సెమీస్ దారులు మూసుకుపోతాయి కాబట్టి ఎలాగైనా గెలవాలని బంగ్లాదేశ్ అనుకుంటోంది. అందుకోసం సర్వశక్తులు ఒడ్డాలని భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్​ ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

భారత్-బంగ్లా పోరు కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెమీస్ బెర్త్​ను డిసైడ్ చేసే మ్యాచ్ కావడంతో దీని కోసం వెయిటింగ్ ఎక్కువైంది. ఈ తరుణంలో దేశ ప్రధాని మోడీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భారత్-బంగ్లా మ్యాచ్​ గురించి ఆయన రియాక్ట్ అయ్యారు. ఇరు జట్లకు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. బంగ్లాదేశ్​తో మన దేశానికి సత్సంబంధాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. బంగ్లాతో రిలేషన్స్​కు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ‘ఇవాళ సాయంత్రం టీ20 వరల్డ్ కప్​లో భారత్-బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఈ సందర్భంగా ఇరు జట్లకు నా తరఫున బెస్ట్ విషెస్. బంగ్లా మన దేశానికి అతిపెద్ద డెవలప్​మెంట్ పార్ట్​నర్​గా ఉంది. ఆ కంట్రీతో సత్సంబంధాలకు మేం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం’ అని మోడీ చెప్పుకొచ్చారు.

ఇక, ఇవాళ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మోడీ సమావేశమయ్యారు. హైదరాబాద్ హౌస్​లో వీళ్ల భేటీ జరిగింది. ఇరు దేశాల మధ్య డిజిటల్​ పార్ట్​నర్​షిప్, గ్రీన్ పార్ట్​నర్​షిప్, బ్లూ ఎకానమీ, స్పేస్ కోఆపరేషన్, రైల్వే కనెక్టివిటీ, ఓషియోనగ్రఫీ తదితర విషయాలపై ఒప్పందాలు జరిగాయి. అలాగే రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, టెర్రరిజంపై కలసికట్టుగా పోరాడటం లాంటి విషయాల మీద మోడీ-హసీనాలు సుదీర్ఘ చర్చలు జరిపారు. భారత్-బంగ్లా మ్యాచ్ గురించి మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్​కు వర్షం రూపంలో ఆటంకం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆంటిగ్వాలో చిన్నపాటి వాన మొదలైందని తెలుస్తోంది. ఇది మ్యాచ్​ టైమ్​కు తీవ్రంగా మారితే ప్రమాదమే. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఇరు టీమ్స్​కు చెరో పాయింట్​ ఇస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి