Nidhan
టీమిండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు తన పరువు తానే తీసుకున్నాడు. అనవసర బిల్డప్ ఇచ్చి తుస్సుమన్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
టీమిండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు తన పరువు తానే తీసుకున్నాడు. అనవసర బిల్డప్ ఇచ్చి తుస్సుమన్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Nidhan
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఎప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా క్రికెట్లో అతడు యాక్టివ్‌గా ఉంటున్నాడు. కామెంట్రీ చేస్తూ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో అతడు చేస్తున్న కొన్ని చేష్టలు వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్-2024 సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి అతడు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. నాకౌట్ ఫైట్‌లో ఆర్సీబీ చేతుల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడటాన్ని జీర్ణించుకోలేకపోయాడు రాయుడు. దీంతో బెంగళూరు ఈసారి కప్పు కొట్టాలని.. ఒకవేళ టైటిల్ రాకపోతే సీఎస్కే దగ్గర ఉన్న కప్పుల్లో నుంచి ఒకదాన్ని ఇచ్చేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ టైమ్‌లో రాయుడు వ్యాఖ్యలతో అతడిపై ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. నెట్టింట అతడి మీద ట్రోలింగ్ నడిచింది. ఈ కాంట్రవర్సీ ఎలాగోలా సమసిపోయింది. అయితే తాజాగా రాయుడుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీ20 వరల్డ్ కప్-2024లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న రాయుడు తన పరువు తానే పోగొట్టుకున్నాడు. భారత స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్‌తో కలసి బౌండరీ లైన్ దగ్గర కాసేపు గడిపాడు రాయుడు. అయితే ఆ సమయంలో సరదాగా ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశాడతను. క్యాచ్‌లు పట్టేందుకు ప్రయత్నించి అతడు విఫలమయ్యాడు. ఓ క్యాచ్ పట్టబోయి బౌండరీ రోప్ దాటి కిందపడ్డాడు. రాయుడు క్యాచ్ పడతాడని అనుకున్న సిరాజ్.. అనూహ్యంగా కిందపడటంతో నవ్వాపుకోలేకపోయాడు.
రాయుడు కింద పడగానే సిరాజ్ నవ్వుల్లో మునిగిపోయాడు. లేచిన వెంటనే అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. రాయుడు తప్పుగా అనుకుంటాడని కూడా భావించకుండా సిరాజ్ నవ్వుతూనే ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ రెగ్యులర్‌గా క్రికెట్ ఆడట్లేదు కాబట్టి ఇలా జరిగిందని అంటున్నారు. అయితే మరికొందరు నెటిజన్స్ మాత్రం బిల్డప్ ఇచ్చి పరువు పోగొట్టుకోవడం అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. వరల్డ్ కప్‌లో అదరగొడుతున్న టీమిండియాను రాయుడు మెచ్చుకున్నాడు. మెగాటోర్నీలో జట్టు ఆడుతున్న తీరు అద్భుతమని ప్రశంసించాడు. సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఆటతీరు అద్భుతమన్నాడు. బుమ్రా భారత టీమ్‌కు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పాడు. అతడు జట్టులో ఉండటం మనందరి అదృష్టమని పేర్కొన్నాడు. రాయుడు క్యాచ్ మిస్ ఘటనపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.