iDreamPost
android-app
ios-app

భారత్ బాటలో ఆఫ్ఘాన్.. ఆ రెండు టీమ్స్​కు ఎదురుదెబ్బ అంటున్న వసీం జాఫర్!

  • Published Jun 25, 2024 | 6:34 PM Updated Updated Jun 25, 2024 | 6:34 PM

ఆఫ్ఘానిస్థాన్ జట్టు సంచలనం సృష్టించింది. అద్భుతమైన ఆటతీరుతో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన రషీద్ సేన.. ఇవాళ బంగ్లాదేశ్​ను కూడా మట్టికరిపించి పొట్టి కప్పులో సెమీస్​కు దూసుకెళ్లింది.

ఆఫ్ఘానిస్థాన్ జట్టు సంచలనం సృష్టించింది. అద్భుతమైన ఆటతీరుతో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన రషీద్ సేన.. ఇవాళ బంగ్లాదేశ్​ను కూడా మట్టికరిపించి పొట్టి కప్పులో సెమీస్​కు దూసుకెళ్లింది.

  • Published Jun 25, 2024 | 6:34 PMUpdated Jun 25, 2024 | 6:34 PM
భారత్ బాటలో ఆఫ్ఘాన్.. ఆ రెండు టీమ్స్​కు ఎదురుదెబ్బ అంటున్న వసీం జాఫర్!

ఆఫ్ఘానిస్థాన్ జట్టు అనుకున్నది సాధించింది. ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టింది. పొట్టి కప్పులో అద్వితీయ ఆటతీరుతో సెమీస్​కు దూసుకెళ్లింది రషీద్ సేన. బంగ్లాదేశ్​పై తప్పక నెగ్గాల్సిన సూపర్ పోరులో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆఫ్ఘాన్ నాకౌట్​కు క్వాలిఫై అవ్వగా.. బంగ్లా, ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టాయి. ఒక్క దెబ్బతో ఆ రెండు టీమ్స్​ను ఇంటికి పంపించింది ఆఫ్ఘాన్. మెగాటోర్నీలో సంచలన విజయాలు సాధిస్తూ వస్తున్న ఆఫ్ఘాన్ ఈసారి కూడా పట్టు వదల్లేదు. బంగ్లాతో మ్యాచ్​తో తొలుత బ్యాటింగ్ చేసి 115 పరుగులు చేసింది. టార్గెట్ చిన్నదే అయినా సూపర్బ్‌ బౌలింగ్​తో దాన్ని కాపాడుకుంది. కెప్టెన్ రషీద్ ఖాన్ (4/23)తో పాటు మ్యాంగో మ్యాన్ నవీనుల్ హక్ (4/26) చెలరేగడంతో బంగ్లా 105 పరుగులకే కుప్పకూలింది.

ఆఫ్ఘానిస్థాన్ విక్టరీతో కాబూల్ నుంచి కాందహార్ వరకు అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. సంచలన ప్రదర్శనతో సెమీస్​కు దూసుకెళ్లిన ఆ జట్టును అందరూ మెచ్చుకుంటున్నారు. మాజీ క్రికెటర్లు, అనలిస్టులు, ఎక్స్​పర్ట్స్ రషీద్ సేన ఆటతీరుపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. తాజాగా భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ కూడా ఆ టీమ్​ను మెచ్చుకున్నాడు. ఆఫ్ఘాన్​లు అందరి మనసులు గెలుచుకున్నారని అన్నాడు. భారత్ బాటలో ఆ టీమ్ నడుస్తోందని తెలిపాడు. అయితే ఒకప్పుడు టీమిండియాను ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి బిగ్ టీమ్స్ అవమానించాయని, ఇప్పుడు అవే జట్లు మెన్ ఇన్ బ్లూకు రెడ్ కార్పెట్ వేస్తున్నాయని తెలిపాడు. క్రికెట్​లో ఆఫ్ఘాన్ వేగంగా ఎదిగిన తీరు అద్భుతమని.. ఆ జట్టు ఎదుగుదల వల్ల ఇంగ్లండ్, ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బేనని ఇన్​డైరెక్ట్​ కామెంట్ చేశాడు.

‘అప్పట్లో ఆస్ట్రేలియా ఎప్పుడో ఓసారి గానీ భారత్​ను పర్యటనకు ఆహ్వానించేది కాదు. పదేళ్లకు ఒకసారి సిరీస్ నిర్వహించేది. ఇంగ్లండ్ కూడా ఇలాగే బిహేవ్ చేసేది. టీమిండియా టెస్ట్ సిరీస్​ ఆడాల్సి ఉంటే ఎలాగైనా దాన్ని తప్పించుకోవాలని ప్లాన్ చేసేది. కానీ ఆ రెండు బోర్డులు ఇప్పుడు భారత్​ అంటే పడి చస్తాయి. మా దేశానికి రమ్మంటే మా దేశానికి రమ్మంటూ టీమిండియాకు రెడ్ కార్పెట్ పరచడం చూస్తున్నాం. ఆఫ్ఘానిస్థాన్ టీమ్ విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. ఆఫ్ఘాన్​ టీమ్​ను క్రికెట్ ప్రపంచం గౌరవించి తీరుతుంది’ అని జాఫర్ చెప్పుకొచ్చాడు. భారత్​లాగే ఆఫ్ఘాన్ వెంట బిగ్ టీమ్స్ పడతాయని.. ఇంగ్లండ్, ఆసీస్ బోర్డులు ఆ జట్టుతో సిరీస్ కోసం తహతహలాడటం పక్కా అని స్పష్టం చేశాడు. ఆఫ్ఘాన్​కు ఇక మీదట అందరూ రెడ్ కార్పెట్ పరుచుతారని పేర్కొన్నాడు. ఆ టీమ్​కు రెస్పెక్ట్ ఇవ్వక తప్పదని.. తమ ఆటతీరుతో వాళ్లు ఇది సంపాదించుకున్నారని మెచ్చుకున్నాడు. మరి.. ఆఫ్ఘాన్ ఎదుగుదల వల్ల ఇంగ్లండ్, ఆసీస్​కు కష్టమేనంటూ జాఫర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by CricFit | Cricket News Update (@cricfit)