iDreamPost
android-app
ios-app

WI vs AUS: ఆసీస్ బౌలర్లను చీల్చి చెండాడిన పూరన్.. సిక్సర్ల సునామీ!

  • Published May 31, 2024 | 11:01 AM Updated Updated May 31, 2024 | 11:01 AM

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో సిక్సర్ల సునామీ సృష్టించాడు వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు నికోలస్ పూరన్. ఐపీఎల్ ఫామ్ ను కొనసాగిస్తూ.. ఆసీస్ బౌలర్లను చీల్చి చెండాడాడు.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో సిక్సర్ల సునామీ సృష్టించాడు వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు నికోలస్ పూరన్. ఐపీఎల్ ఫామ్ ను కొనసాగిస్తూ.. ఆసీస్ బౌలర్లను చీల్చి చెండాడాడు.

WI vs AUS: ఆసీస్ బౌలర్లను చీల్చి చెండాడిన పూరన్.. సిక్సర్ల సునామీ!

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ప్రాక్టీస్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదు అయ్యాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 35 రన్స్ తేడాతో ఆసీస్ ను చిత్తు చేసింది వెస్టిండీస్. ఇక ఈ మ్యాచ్ లో తన విశ్వరూపం చూపుతూ.. సిక్సర్ల సునామీ సృష్టించాడు విధ్వంసకర వీరుడు నికోలస్ పూరన్. ఆసీస్ బౌలర్లను చీల్చి చెండాడుతూ.. పరుగుల వరదపారించాడు.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో విండీస్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఐపీఎల్ ఫామ్ ను కొనసాగిస్తూ.. సిక్సులు, ఫోర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 25 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 75 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పూరన్ బ్యాటింగ్ చేసినంతసేపు ప్రత్యర్థి బౌలర్లు ప్రేక్షకపాత్ర వహించక తప్పలేదు. ఐపీఎల్ లో ఎలాంటి థండర్ ఇన్నింగ్స్ లు ఆడాడో.. అదే ఫామ్ ను ఇక్కడా కొనసాగిస్తున్నాడు ఈ విండీస్ వీరుడు.

ఇక పూరన్ కు తోడుగా విండీస్ కెప్టెన్ రోవ్ మన్ పావెల్ సైతం విజృంభించాడు. పావెల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. మిగతా వారు కూడా సూపర్ ఫాస్ట్ బ్యాటింగ్ తో దుమ్మురేపాడు. చార్లెస్(40), రూథర్ ఫొర్డ్(18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 47 నాటౌట్) అదరగొట్టారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. అనంతరం 258 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్ దీటుగానే బదులిచ్చింది. చివరి వరకు పోరాడి 35 రన్స్ తో ఓడిపోయింది. 7 వికెట్ల నష్టానికి 222 రన్స్ చేసింది. జట్టులో జోష్ ఇంగ్లీష్(55), నాథన్ ఎల్లిస్(39) పరుగులు చేశారు. 258 పరుగులు చేసి.. ఈ వరల్డ్ కప్ లో తామెంత ప్రమాదకరమో ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపింది విండీస్ టీమ్. మరి వార్మప్ మ్యాచ్ లోనే రెచ్చిపోయిన విండీస్ టీమ్ వరల్డ్ కప్ లో డేంజర్ గా మారనుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.