Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 కోసం అమెరికాలో ల్యాండ్ అయిపోయాడు విరాట్ కోహ్లీ. మిగతా సహచరులంతా ఎప్పుడో అగ్రరాజ్యానికి చేరుకోగా.. కింగ్ కాస్త ఆలస్యంగా రీచ్ అయ్యాడు.
టీ20 వరల్డ్ కప్-2024 కోసం అమెరికాలో ల్యాండ్ అయిపోయాడు విరాట్ కోహ్లీ. మిగతా సహచరులంతా ఎప్పుడో అగ్రరాజ్యానికి చేరుకోగా.. కింగ్ కాస్త ఆలస్యంగా రీచ్ అయ్యాడు.
Nidhan
టీమిండియా టాప్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ గురించి తెలిసిందే. ఆఫ్ ది ఫీల్డ్ అందర్నీ నవ్విస్తూ, నవ్వుతూ కూల్‌గా ఉంటాడు. అనవసర వివాదాలకు దూరంగా ఉంటాడు. తన పనేదో తాను అన్నట్లు బిహేవ్ చేస్తాడు. కానీ గ్రౌండ్లోకి అడుగు పెట్టాడా అతడిలోని మరో యాంగిల్ బయటకొస్తుంది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు అది బ్యాటింగ్ కానివ్వండి, బౌలింగ్ కానివ్వండి కోహ్లీ ఇంటెన్స్‌గా కనిపిస్తాడు. ఫీల్డింగ్‌లో హుషారుగా ఉంటాడు. ఐదు రోజులు ఆడే టెస్ట్ మ్యాచ్ కానివ్వండి.. అతడి ఎనర్జీలో ఇసుమంత కూడా మార్పు ఉండదు. ఎప్పుడూ అలసటను దరిచేరనీయడు. అతడు ఉత్సాహంగా ఉంటూ ఇతరుల్లో కూడా ఎనర్జీ నింపుతుంటాడు. దీంతో అసలు కోహ్లీ ఇంత హుషారుగా ఎలా ఉంటాడు? అతడి రహస్యం ఏంటి? అనేది తెలుసుకోవాలని అభిమానులు కోరుకుంటారు.
కోహ్లీని కూడా చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతుంటారట. ఇంత ఎనర్జీతో ఎలా ఉంటావ్? నీకు ఇది ఎలా సాధ్యమవుతోంది? అని క్వశ్చన్ చేస్తుంటారట. స్వయంగా అతడే ఈ విషయాన్ని రివీల్ చేశాడు. టీ20 వరల్డ్ కప్-2024 కోసం అమెరికాలో ల్యాండ్ అయిపోయాడు విరాట్. మిగతా సహచరులంతా ఎప్పుడో అగ్రరాజ్యానికి చేరుకోగా.. కింగ్ కాస్త ఆలస్యంగా రీచ్ అయ్యాడు. తాజాగా టీమ్‌తో అతడు జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన ఎనర్జీ సీక్రెట్ ఏంటో చెప్పమంటూ చాలా మంది అడుగుతుంటారని విరాట్ తెలిపాడు. ఏ టోర్నమెంట్‌కు అయినా సరే 120 శాతం కష్టపడాలి, రాణించాలనే తపనతో తాను వస్తుంటానని అదే తన రహస్యమని కింగ్ రివీల్ చేశాడు.
‘ఇంత ఎనర్జీతో ఎలా ఉంటావని చాలా మంది నన్ను తరచూ అడుగుతుంటారు. వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే.. ఏ కాంపిటీషన్కైనా నేను 120 శాతం సన్నద్ధతతో వస్తా. 75 శాతం ప్రిపరేషన్‌తో నేనెప్పుడూ రాలేదు. నా మటుకు నూటా ఇరవై శాతం సన్నద్ధతతో రెడీ అయి వస్తా. తప్పక రాణించాలనే కసితో టోర్నీలో అడుగుపెడతా’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. పిల్లలతో సమయాన్ని గడపడం, వాళ్లతో ఆడుకోవడాన్ని మించిన అద్భుతమైన విషయం ఈ ప్రపంచంలో లేదని కింగ్ పేర్కొన్నాడు. చిన్నారులతో ఉంటే టైమ్ ఇట్టే గడిచిపోతుందని.. అదో అందమైన అనుభూతి అని కోహ్లీ పేర్కొన్నాడు. ఇక, ఐపీఎల్-2024లో 741 పరుగులు బాదిన విరాట్.. వరల్డ్ కప్‌లోనూ అదే రీతిలో ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అతడు చెలరేగితే రోహిత్ సేనకు తిరుగుండదని చెబుతున్నారు. మరి.. కోహ్లీ ఎనర్జీ సీక్రెట్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Virat Kohli said “Lots of people ask me the question very regularly – ‘how do you have so much energy’ – I tell them, I arrive to competition at 120%, I never arrive at 75%”. [TidlSport] pic.twitter.com/NcGTVmMtqF
— Johns. (@CricCrazyJohns) June 1, 2024