iDreamPost

మరోసారి ప్రాక్టీస్ కు దూరం.. విరాట్ కోహ్లీకి ఏమైంది? నిజాలు దాస్తున్నారా?

టీ20 వరల్డ్ కప్ కోసం న్యూయార్క్ లో అడుగుపెట్టిన టీమిండియా రన్ మెషన్ విరాట్ కోహ్లీ.. ఇప్పటి వరకు ఒక్క ప్రాక్టీస్ సెషన్ లో కూడా పాల్గొనలేదు. దాంతో కోహ్లీకి ఏమైంది? బీసీసీఐ నిజాలు దాస్తోందా? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. పూర్తి వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ కోసం న్యూయార్క్ లో అడుగుపెట్టిన టీమిండియా రన్ మెషన్ విరాట్ కోహ్లీ.. ఇప్పటి వరకు ఒక్క ప్రాక్టీస్ సెషన్ లో కూడా పాల్గొనలేదు. దాంతో కోహ్లీకి ఏమైంది? బీసీసీఐ నిజాలు దాస్తోందా? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మరోసారి ప్రాక్టీస్ కు దూరం.. విరాట్ కోహ్లీకి ఏమైంది? నిజాలు దాస్తున్నారా?

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ లో దుమ్మురేపింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించింది భారత జట్టు. దాంతో టీమ్ కు తొలి మ్యాచ్ కు ముందు మంచి ప్రాక్టీస్ లభించినట్లు అయ్యింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో టీమిండియా ప్లేయర్లు సత్తాచాటారు. ఇక న్యూయార్క్ లో అడుగుపెట్టినప్పటి నుంచే ఆటగాళ్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే జట్టులో ఆలస్యంగా చేరిన విరాట్ కోహ్లీ ఇంతవరకు ఒక్క ప్రాక్టీస్ సెషన్ లో కూడా పాల్గొనలేదు. దాంతో విరాట్ కోహ్లీకి ఏమైంది? అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేనేజ్ మెంట్ నిజాలు దాస్తోందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ కోసం న్యూయార్క్ చేరుకున్న టీమిండియా.. కఠోరమైన ప్రాక్టీస్ చేస్తోంది.  సోమవారం టీమిండియా తమ చివరి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొననుంది. బంగ్లాదేశ్ తో(జూన్ 4) మ్యాచ్ కు ముందు ప్లేయర్లకు టీమ్ మేనేజ్ మెంట్ విశ్రాంతి  ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దాంతో వీలైనంత ఎక్కువ సేపు నెట్స్ లో ఉండాలని భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఓ విషయం టీమిండియా ఫ్యాన్స్ లో ఆందోళన కలిగిస్తోంది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టీమ్ లోకి ఆలస్యంగా చేరాడు. న్యూయార్క్ చేరుకున్న విరాట్.. ఇప్పటి వరకు ఒక్క ప్రాక్టీస్ సెషన్ లో కూడా పాల్గొనలేదు. అయితే ఆదివారం ప్రాక్టీస్ చేస్తాడని అందరూ భావించారు. కానీ ఆ రోజు కూడా విరాట్ గ్రౌండ్ లోకి దిగలేదు. సోమవారం చివరి సెషన్ లో ప్రాక్టీస్ కు విరాట్ కోహ్లీ వస్తాడని సమాచారం.

అయితే కోహ్లీ న్యూయార్క్ చేరుకుని.. టీమ్ తో కలిసినప్పటికీ.. ప్రాక్టీస్ కు హాజరుకాకపోవడంతో మేనేజ్ మెంట్ నిజాలు దాస్తోందా? అంటూ అనుమానిస్తున్నారు నెటిజన్లు. విరాట్ కు చిన్న గాయమైందని, అందుకే టీమ్ తో చేరడానికి ఆలస్యం అవుతుందని మేనేజ్ మెంట్ కొన్ని రోజుల క్రితం చెప్పింది. చిన్న ఇంజ్యూరే అయినప్పటికీ.. కోహ్లీ ప్రాక్టీస్ కు ఎందుకు రావడంలేదు. బీసీసీఐ నిజాలు దాస్తోందా? గాయం పెద్దదా? అందుకే కోహ్లీ గ్రౌండ్ లోకి దిడం లేదా? అన్న అనుమానులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విషయంలో బీసీసీఐ ఎందుకు మౌనం వహిస్తోంది? తెలియాలి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో పరుగుల వరదపారించాడు విరాట్. ఈ సీజన్ లో 15 మ్యాచ్ లు ఆడి 741 పరుగులు చేశాడు. ఇదే ఫామ్ ను టీ20 వరల్డ్ కప్ లో కొనసాగిస్తే.. భారత్ కప్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. మరి కోహ్లీ ప్రాక్టీస్ కు రాకపోవడానికి కారణం ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి