iDreamPost

వీడియో: IND vs BAN మ్యాచ్.. విరాట్ ఫన్నీ మూమెంట్స్ చూశారా? కడుపుబ్బా నవ్వాల్సిందే..

సూపర్ 8లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్ల ఫన్నీ మూమెంట్స్ తో అలరించాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

సూపర్ 8లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్ల ఫన్నీ మూమెంట్స్ తో అలరించాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

వీడియో: IND vs BAN మ్యాచ్.. విరాట్ ఫన్నీ మూమెంట్స్ చూశారా? కడుపుబ్బా నవ్వాల్సిందే..

విరాట్ కోహ్లీ.. టీమిండియా రన్ మెషిన్ గా, రికార్డుల రారాజుగా ప్రపంచ క్రికెట్ లో వెలుగొందుతున్నాడు. బ్యాటింగ్ లో ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో.. గ్రౌండ్ లోకి ఫీల్డింగ్ కు దిగితే.. అంతే అగ్రెసివ్ గా ఉంటాడు. అయితే తనలో ఉన్న ఎంటర్ టైనర్ ను అప్పుడప్పుడు బయటకు తీస్తూ.. ప్రేక్షకులతో పాటుగా సహచర ఆటగాళ్లను కూడా కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8లో భాగంగా తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 50 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఫన్నీ మూమెంట్స్ చూశారా? చూస్తే.. కడుపుబ్బా నవ్వాల్సిందే.

విరాట్ కోహ్లీ స్టార్ బ్యాటరే కాదు.. అంతకు మించి గొప్ప ఎంటర్ టైనర్ కూడా. బ్యాటింగ్ కు దిగితే.. బౌలర్లను ఊచకోత కోయడమే కాదు.. ఫీల్డింగ్ లో చిరుత వేగంతో మెరుపులు కూడా మెరిపించగలడు. ఇది ఎన్నో సందర్భాల్లో రుజువుకూడా చేశాడు. ఇక ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో కోహ్లీ డ్యాన్స్ లు చేయడం మనకు తెలియనిది కాదు. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో తనలో ఉన్న ఎంటర్ టైనర్ ను మరోసారి ప్రపంచానికి చూపించాడు. బంగ్లా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో పలు మార్లు డ్యాన్స్ లు వేస్తూ కనిపించాడు.

ఇక మ్యాచ్ లో కోహ్లీ చేసిన ఓ ఫన్నీ మూమెంట్ అందరిని నవ్విస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే? టీమిండియా యంగ్ పేసర్ అర్షదీప్ సింగ్ వేసిన ఓ ఓవర్లో బంగ్లా బ్యాటర్ సిక్సు కొట్టాడు. ఆ బాల్ సరాసరి వెళ్లి బ్లాస్టింగ్ బల్లాల కింద పడింది. బౌండరీలైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ.. బంతి కోసం బల్లాల కిందికి దూరాడు. దాంతో స్టేడియం మెుత్తం ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మరి బంగ్లాతో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఫన్నీ మూమెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ICC Hindi (@icchindiofficial)

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి